COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కోవిడ్ రాదా? ఈ విషయాలు తెలుసుకోండి..

COVID Vaccine: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అయితే, ఇలాంటి పరిస్థితిలో కరోనాను నివారించడానికి ఇచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనే దానిపై చర్చ నడుస్తోంది.

Update: 2025-06-04 05:57 GMT

COVID Vaccine: బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కోవిడ్ రాదా? ఈ విషయాలు తెలుసుకోండి..

COVID Vaccine: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. అయితే, ఇలాంటి పరిస్థితిలో కరోనాను నివారించడానికి ఇచ్చిన వ్యాక్సిన్ ఇప్పటికీ ప్రభావవంతంగా ఉంటుందా? లేదా? అనే దానిపై చర్చ నడుస్తోంది. బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తులు కూడా కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడతారా ? ఈసారి కరోనాను నివారించడానికి మనం మళ్ళీ టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందా? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంతో పాటు భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో 1000 మందికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్రతో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. కేవలం రెండు వారాల్లోనే ఈ సంఖ్య రెట్టింపు అయింది. కరోనా వ్యాప్తి చెందుతున్న వేగాన్ని చూస్తే మునుపటి కోవిడ్ పరిస్థితులు వస్తాయేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కొత్త వేరియంట్ వల్ల కరోనా వ్యాప్తి చెందుతోంది

దేశంలో కరోనా వ్యాప్తి వెనుక కోవిడ్ వైరస్ కొత్త రకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొత్త వేరియంట్ల ప్రమాదాలను నివారించడానికి వ్యాక్సిన్ గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. అయితే, కొత్త వేరియంట్లు అంత తీవ్రంగా లేవని, అందువల్ల ప్రస్తుతానికి అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు.

టీకాలు వేసిన వారికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుందా?

బూస్టర్ డోస్ లేదా రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు కొత్త వేరియంట్ నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అలాంటి వారికి కరోనా సోకినప్పటికీ ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉండదు. ఇప్పటివరకు చేసిన పరిశోధనల ప్రకారం, కొత్త వేరియంట్ ప్రభావం 4 లేదా 8 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. అందువల్ల, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తగా ఉండటం ముఖ్యమని సూచిస్తున్నారు. సామాజిక దూరం, శానిటైజర్‌ను ఉపయోగించడం కొనసాగాలన్నారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారికి వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి ఉంటుందని, వారికి వైరస్ నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, బూస్టర్ తీసుకున్న వారికి అస్సలు ఇన్ఫెక్షన్ రాదని కాదు.. వారికి కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. అయితే, లక్షణాలు తీవ్రంగా ఉండే అవకాశం లేదని అంటున్నారు.

Tags:    

Similar News