Super Foods: పిల్లల బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తప్పనిసరి..!

Super Foods: ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Update: 2022-08-25 16:00 GMT

Super Foods: పిల్లల బ్రెయిన్‌ షార్ప్‌గా ఉండాలంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తప్పనిసరి..!

Super Foods: ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్‌ఫుడ్స్‌, జంక్ ఫుడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం విపరీతంగా పెరుగుతుంది. పిల్లల శారీరక, మానసిక వికాసానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం అవసరం. కానీ వారిని బర్గర్లు, పిజ్జా, చాక్లెట్, చిప్స్ వంటి ఆహారాలకి దూరంగా ఉంచడం అంత సులభం కాదు. పిల్లల మంచి చదువులు చదవాలంటే వారిని ఫిట్‌గా ఉంచడం ముఖ్యం. ఈ పరిస్థితిలో మీరు డైట్‌లో కొన్ని సూపర్‌ఫుడ్స్‌ని చేర్చాలి. అవేంటో తెలుసుకుందాం.

1.అరటి

అరటి పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, గ్లూకోజ్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది వారి శరీరానికి, మనస్సుకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది.

2.పండ్లు, కూరగాయలు

పిల్లల ఎదుగుదలకు పండ్లు, కూరగాయలు బాగా దోహదం చేస్తాయి. వీటి కారణంగా శరీరానికి విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

3.నెయ్యి

పిల్లల మానసిక ఎదుగుదలకు నెయ్యి తీసుకోవడం చాలా ముఖ్యం. సహజ కొవ్వుతో పాటు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఎముకలను బలపరుస్తుంది.

4.పాలు

పాలని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, కాల్షియం వంటి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. చాలా సార్లు పిల్లలు పాలు తాగడానికి నిరాకరిస్తారు. కానీ తల్లిదండ్రులుగా పిల్లలను ఒప్పించడం అవసరం.

5.గుడ్డు

గుడ్డులో ప్రొటీన్, విటమిన్-బి, విటమిన్-డి, ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్లు, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. దీన్ని మీ పిల్లలకు ప్రతిరోజూ అల్పాహారంలో ఇస్తే వారి మెదడు అభివృద్ధి బాగుంటుంది.

Tags:    

Similar News