కొలెస్ట్రాల్ తగ్గించే చియా సీడ్స్: పేరుకుపోయిన కొవ్వు కరిగించాలంటే ఇలా తీసుకోండి
గుండె ఆరోగ్యానికి ప్రధాన శత్రువుల్లో కొలెస్ట్రాల్ ఒకటి. ఇది పెరిగితే హార్ట్ అటాక్ వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. డైటీషియన్లు సూచన ప్రకారం చియా సీడ్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

చియా సీడ్స్‌లోని ముఖ్యమైన పోషకాలు
ఫైబర్: 2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్‌లో దాదాపు 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులోని కరిగే ఫైబర్ చిన్నప్రేగుల్లో కొలెస్ట్రాల్‌తో బంధించి దానిని బయటికి పంపుతుంది.
ప్లాంట్ బేస్డ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్: చియా సీడ్స్‌లోని ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ గుండెకు మేలు చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ & యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు: బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరించి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
రోజువారీ డైట్‌లో చియా సీడ్స్‌ను ఎలా తీసుకోవాలి?
ఓవర్‌నైట్ ఓట్స్‌లో కలిపి తినండి.
డిన్నర్ సలాడ్‌లో చల్లండి.
పెరుగు, స్మూతీ లేదా సోయాపాలలో వేసి తాగండి.
చియా పుడ్డింగ్ లేదా గ్రనోలాలో యాడ్ చేయండి.
అవకాడో టోస్ట్ పై చల్లుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
బేకింగ్ ఐటమ్స్‌లో పౌడర్‌లా వేసుకోవచ్చు.
ఓవర్‌నైట్ చియా పుడ్డింగ్ రెసిపీ
ఒక గ్లాసు బాదం లేదా సోయా పాలను తీసుకుని అందులో చియా సీడ్స్ వేసి రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఇష్టమైన పండ్లు (బెర్రీస్, మామిడి) మరియు గుప్పెడు నట్స్ వేస్తే రుచికరమైన, ఆరోగ్యకరమైన పుడ్డింగ్ సిద్ధం అవుతుంది.
చియా సీడ్స్ నిల్వ చేసే విధానం
ఓపెన్ చేయని ప్యాకెట్లను పొడి ప్రదేశంలో స్టోర్ చేయండి.
ఓపెన్ చేసిన ప్యాకెట్లను ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో నిల్వ చేయడం ఉత్తమం.
గమనిక: ఇది సాధారణ సమాచారం మాత్రమే. వైద్య సలహా కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.