Tulsi Leaves: ప్రతిరోజు నాలుగు తులసి ఆకులు.. ఈ సమస్యలకి చక్కటి ఔషధం..!

Tulsi Leaves: ప్రతిరోజు నాలుగు తులసి ఆకులు.. ఈ సమస్యలకి చక్కటి ఔషధం..!

Update: 2022-10-27 04:05 GMT

Tulsi Leaves: ప్రతిరోజు నాలుగు తులసి ఆకులు.. ఈ సమస్యలకి చక్కటి ఔషధం..!

Tulsi Leaves: తులసి మొక్కలో మాతా లక్ష్మి నివసిస్తుందని చెబుతారు. సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన మొక్క. తులసి మొక్క ఉన్న ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదని చెబుతారు. ఇది ఆధ్యాత్మిక మొక్క మాత్రమే కాదు.. ఆయుర్వేద మొక్క కూడా. ఈ మొక్క పచ్చి ఆకులను నమలడం వల్ల మధుమేహంతో సహా చాలా వ్యాధులను నయం చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

మధుమేహం

తులసి ఆకులలో క్యారియోఫిలీన్, మిథైల్ యూజినాల్, యూజినాల్ వంటి మూలకాలు ఉంటాయి. వీటివల్ల శరీరంలో ఇన్సులిన్ సమాన పరిమాణంలో తయారవుతుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి బాగానే ఉండి మధుమేహం రాకుండా ఉంటుంది.

తలనొప్పి

తులసి లీవ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసి ఆకులు చలి, తలనొప్పి, అలర్జీలు, సైనసైటిస్‌లలో దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఇందుకోసం ముందుగా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా గుప్పెడు తాగాలి. మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

ఒత్తిడి దూరం

మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టిసాల్ తులసి ఆకులలో ఉంటుంది. ఒత్తిడితో సతమతమవుతున్న వారికి తులసి ఆకుల వినియోగం మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 12 తులసి ఆకులను నమలడం ప్రారంభించండి. దీని ప్రయోజనాన్ని త్వరలో చూస్తారు.

గొంతు మంట

వాతావరణం మారినప్పుడు గొంతు నొప్పి రావడం సహజమే. దీనిని తొలగించడానికి తులసి ఆకులను వేడినీటిలో బాగా మరిగించి తర్వాత ఆ నీటిని ఫిల్టర్ చేసి నెమ్మదిగా తాగాలి. గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.

నోటి దుర్వాసన

తులసి లీవ్స్ నోటి దుర్వాసన తొలగించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను తినాలి. నోటి దుర్వాసన పోతుంది.

Tags:    

Similar News