Skin Care: పొడి చర్మానికి ఈ 3 వస్తువులతో చెక్.. ధర కూడా తక్కువే..

* తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. * పొడి చర్మానికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది

Update: 2021-11-07 14:00 GMT

పొడి చర్మానికి ఈ 3 వస్తువులతో చెక్(ఫైల్ ఫోటో)

Skin Care: చలికాలంలో అందరు పొడిచర్మంతో ఇబ్బందిపడుతుంటారు. పాలిపోయిన చర్మం, మొటిమలతో బయటికి రాలేకపోతారు. అందుకే చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మాయిశ్చరైజింగ్, హీలింగ్ స్కిన్‌ కేర్ ప్రొడక్ట్‌కి మారడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఇంట్లో దొరికే వస్తువులతో నేచురల్ ప్యాక్స్‌ కూడా ట్రై చేయవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

1. తేనె

తేనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఈ కారణంగా మార్కెట్‌లో లభించే అనేక క్రీమ్‌లు, లోషన్‌లలో దీనిని ఉపయోగిస్తారు. తేనెలో ఉండే ఎంజైమ్‌లు చర్మంలోపలికి వెళ్లి మృదువుగా చేస్తాయి. తేనె అనేది చాలా సౌందర్య ఉత్పత్తులలో సాధారణంగా ఉపయోగించే పదార్ధం. అంతేకాదు పొడి చర్మంపై నేరుగా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో తేనె వేయాలి. అందులో కాటన్ బాల్‌ని ముంచి ముఖం, మెడ అంతా అప్లై చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.

2. కలబంద

ఈ రోజుల్లో చర్మ సంరక్షణ ఉత్పత్తులలో కలబందను విరివిగా ఉపయోగిస్తున్నారు. అలోవెరా మ్యూకోపాలిసాకరైడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మం లోపల తేమను లాక్ చేయడానికి సహాయపడుతుంది. కలబందలో ఉండే హైడ్రేటింగ్ గుణాలు పొడి చర్మానికి మంచి మందు. మీరు దీన్ని మీ సాధారణ మాయిశ్చరైజర్‌తో భర్తీ చేయవచ్చు. మీ చర్మంపై మచ్చలుంటే మీరు కలబందను నేరుగా మీ ముఖంపై ఉపయోగించవచ్చు. కొంత సమయం తర్వాత కడిగేయాలి. మీరు మీ ముఖం మీద ఎర్రగా లేదా దురదగా అనిపిస్తే, మీరు రాత్రి నిద్రపోయే ముందు కలబందను అప్లై చేయవచ్చు. దీన్ని రాత్రిపూట మాస్క్‌గా వాడితే మంచిది.

3. కొబ్బరి నూనె

పొడి చర్మానికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెను కూడా నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఉత్తమ ఫలితాల కోసం రాత్రిపూట కొబ్బరి నూనెను ఉపయోగించండి. ముఖం, మెడ మీద కొబ్బరి నూనెని పలుచని అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం టిష్యూతో తుడవండి. ఒకవేళ మీరు రాత్రంతా నూనెను ఉంచకూడదనుకుంటే శుభ్రమైన ముఖంపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత తుడవండి. చర్మం మృదువుగా, బిగుతుగా మారిపోతుంది.

Tags:    

Similar News