ముక్కుకారే సమస్యకు బెల్లంతో చెక్‌

బెల్లం భారతీయుల ఆహార పదార్ధాలల్లో ముఖ్యమైనది. శరీరానికి అత్యంతా మేలుచేస్తుంది ఈ బెల్లం.

Update: 2020-03-18 07:26 GMT

బెల్లం భారతీయుల ఆహార పదార్ధాలల్లో ముఖ్యమైనది. శరీరానికి అత్యంతా మేలుచేస్తుంది ఈ బెల్లం. హిందూ సాంప్రదాయాల ప్రకారం పిండివంటల్లో దేవుడి నైవేద్యాల్లో ఈ బెల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు. పంచదార కంటే బెల్లంలోనే ఎన్నో పోషకాలు ఉంటాయి.. కాబట్టే తియ్యన్ని బెల్లేన్ని తీసుకునేందుకు అధిక ప్రాధాన్యతను కనబరుస్తుంటారు. చెరుకు రసంతో తయారయ్యే ఈ బెల్లంలో సహజసిద్ధమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. బెల్లాన్ని ఆహార పదార్ధాల తయారీలోనే కాకుండా ఆయుర్వేద వైద్యంలోనూ విరివిగా వినియోగిస్తారు. ఎన్నో మందుల తయారీలోబల్లాన్ని వాడతారు. బెల్లంలో సమృద్ధిగా ఉండే ఐరన్ శరీరానికి ఎన్నో పోషకాల ను అందిస్తుంది.

పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారికి బెల్లం చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీళ్లో బెల్లాన్ని కరగదీసి పాకం తయారు చేసి అందులో మూడు లేదా నాలుగు తులసి ఆకులు వేసి రోజులో రెండు లేదా మూడు సార్లు తాగడం వల్ల పొడి దగ్గు నుంచి విముక్తిని పొందవచ్చు. ఇక ఏదైన ఆహారాన్ని హెవీగా తీసుకుంటే అజీర్తి సమస్య వేధిస్తుంటుంది. అలా ఇబ్బందిపడేవారు భోజనం పూర్తైన తరువాత బెల్లాన్ని తినడం వల్ల అజీర్తి సమస్యలు అస్సలే దరిచేరవు. డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది.

బాహిష్ట సమస్యలతో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమస్యతో సతమతమయ్యేవారు గ్లాసెడు కాచిన పాలల్లో బెల్లం వేసుకుని ప్రతి రోజు ఆ పాలను తాగుతుండాలి.. ఇలా చేయడం వల్ల నెలసరి సమస్యలు ఉండవు. దెబ్బలు తగిలినా... కమిలిన ప్రాంతాల్లో నొప్పులతో బాధపడుతుంటారు అలాంటి వారు బెల్లాన్ని నెయ్యితో వేడి చేసి నొప్పి కలిగిన ప్రాంతాల్లో పట్టించాలి. తద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొంత మంది పిల్లలు తరుచుగా జలుబుతో బాధపడుతుంటారు.. నిత్యం ముక్కు కారుతూనే ఉంటుంది. ఈ పిల్లలకు బెల్లం మంచి వైద్యం అనే చెప్పాలి..పెరుగు బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు అన్నం పెడితే ఈ సమస్య దూరమవుతుంది. అంతే కాదు మైగ్రేన్ వంటి సమస్యలు తీరుతాయి.


Tags:    

Similar News