Ginger Pak: దగ్గు, జలుబు, గొంతునొప్పులకు అల్లం పాక్‌తో చెక్.. ఎలాగంటే..?

Ginger Pak: దగ్గు, జలుబు, గొంతునొప్పులకు అల్లం పాక్‌తో చెక్.. ఎలాగంటే..?

Update: 2022-02-01 07:00 GMT

 దగ్గు, జలుబు, గొంతునొప్పులకు అల్లం పాక్‌తో చెక్.. ఎలాగంటే..?

Ginger Pak: ప్రాచీన కాలం నుంచి భారతీయులు అల్లాన్ని వంటలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే సనాతన ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి వినియోగిస్తారు. అల్లం వంటల రుచిని పెంచడమే కాకుండా శరీరాన్ని రోగాల బారినుంచి కాపాడుతుంది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ, సీజనల్‌ వ్యాధులు మొదలైన వాటికి చక్కటి చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇటీవల ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా సీజనల్ ఫ్లూ తగ్గించడానికి అల్లం పాక్‌ తినాలని సూచించింది. 

అల్లం పాక్‌ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడి ఆకలి పెరుగుతుంది. ఇది కాకుండా జలుబు, దగ్గు కాకుండా, గొంతు నొప్పి వంటి సమస్యలకి ఉపశమనం దొరుకుతుంది. అల్లం ఇష్టపడని వారు బెల్లంతో కలిపి తినవచ్చు. సాధారణంగా అల్లం స్వభావం చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం లేకపోతే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అల్లంపాక్ పరగడుపున తినకూడదు. అన్నంతిన్న తర్వాత తినాలని సూచించింది. 

అల్లంపాక్ తయారీలో ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన పదార్థాలు కలిపి తయారుచేస్తే సూపర్‌గా ఉంటాయి. బెల్లం, అల్లం, ఎండు శొంఠి పొడి, నెయ్యి, యాలకులు, దాల్చినచెక్క, బే ఆకు, నాగకేసర, నల్ల మిరియాలు, కొత్తిమీర పొడి, విడంగ, జీర, పిప్పలి మొదలైనవి కలిపి అల్లంపాక్ తయారుచేస్తారు. ఈ కరోనా సమయంలో అల్లం పాక్ అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. 

Tags:    

Similar News