Chanakya Niti: పెళ్లైన తర్వాత కూడా కొందరు మగాళ్లు వేరే మహిళలపై ఆకర్షితులవ్వడానికి కారణం ఇదే..!

ఆడ, మగ మధ్య ఆకర్షణ సహజం. కానీ పెళ్లైన తర్వాత కూడా కొందరు మగాళ్లు తమ భార్యను వదిలి ఇతరుల భార్యల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఈ విషయాన్ని వేల ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యుడు తన "చాణక్య నీతి" గ్రంథంలో వివరించారు.

Update: 2025-07-18 13:45 GMT

Chanakya Niti: పెళ్లైన తర్వాత కూడా కొందరు మగాళ్లు వేరే మహిళలపై ఆకర్షితులవ్వడానికి కారణం ఇదే..!

ఆడ, మగ మధ్య ఆకర్షణ సహజం. కానీ పెళ్లైన తర్వాత కూడా కొందరు మగాళ్లు తమ భార్యను వదిలి ఇతరుల భార్యల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఈ విషయాన్ని వేల ఏళ్ల క్రితమే ఆచార్య చాణక్యుడు తన "చాణక్య నీతి" గ్రంథంలో వివరించారు. ఆయన ప్రకారం, మానవ బలహీనతలు, క్రమశిక్షణ లోపం, తాత్కాలిక ఆనందాల పట్ల ఆకర్షణే దీనికి ప్రధాన కారణాలు.

ఇతర మహిళలు దేవతలా కనిపించడమే ప్రధాన కారణం

చాణక్యుడు చెబుతున్నట్లుగా, చాలామంది మగాళ్లు తమ భార్యను ఇతరులతో పోల్చడం తప్పు. "పొరుగింటి పుల్లకూర రుచి" అన్నట్లు, పక్కింటి మహిళ అందంగా, ప్రేమగా ఉంటుందని అనిపిస్తుంది. కానీ ఇది కేవలం భ్రమ మాత్రమే. దూరం నుంచి ఆకర్షణీయంగా కనిపించే ఆ జీవితం కూడా ఎన్నో సమస్యలతో నిండిపోయి ఉండొచ్చు. ఈ ఆలోచనా విధానం సొంత భార్యలోని మంచి గుణాలను విస్మరించేటట్లు చేస్తుంది.

నిషేధానికి ఆకర్షణ

"వద్దు" అనగానే దాని పట్ల ఆసక్తి పెరగడం సహజమని చాణక్యుడు చెప్పారు. రహస్యంగా ఏదైనా చేయడం ఒక థ్రిల్‌ను ఇస్తుంది. ఈ తాత్కాలిక ఉత్సాహం కోసమే కొందరు మగాళ్లు ఇతరుల భార్యల పట్ల ఆకర్షితులవుతారు. కానీ ఈ తప్పు చివరికి పశ్చాత్తాపానికే దారి తీస్తుంది.

ఇంట్లో సంతోషం లేకపోవడం

వైవాహిక జీవితంలో ప్రేమ, గౌరవం, కమ్యూనికేషన్ లేకపోతే పురుషులు ఆ ప్రేమ కోసం బయట వెతుకుతారు. వారిని పట్టించుకునే, అర్థం చేసుకునే మహిళ కనబడితే సులభంగా ఆకర్షితులవుతారు. నేటి రీసెర్చ్‌లు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాయి.

ఫ్రెండ్ సర్కిల్ ప్రభావం

ఎవరితో స్నేహం చేస్తే మన ఆలోచనా విధానం కూడా అలాగే మారుతుంది. తప్పుడు సంబంధాలను ప్రోత్సహించే స్నేహితులు ఉంటే, ఆ వ్యక్తి కూడా అది సహజమని భావిస్తాడు.

సెల్ఫ్-కంట్రోల్ లోపం

చాణక్యుడు ప్రకారం, మగాడి అసలైన బలం అతని ఆత్మనిగ్రహం. కోరికలను కంట్రోల్ చేయలేకపోతే, ఎంత నష్టమో తెలిసినా తప్పు దారిలోకి వెళ్తాడు. సోషల్ మీడియా, బయట పరిచయాలు ఈ నియంత్రణకు పెద్ద సవాలుగా మారతాయి.

చాణక్యుడు చెప్పిన పరిష్కారం

భార్యాభర్తలు మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడుకోవాలి. బంధంలో గౌరవం, ప్రేమ ఉండాలి. మగాడు తన కోరికలను నియంత్రించుకోవడానికి ప్రతిరోజూ కృషి చేయాలి. కేవలం బాహ్య సౌందర్యం కాకుండా, మంచి విలువలు, సరిపోయే మనస్తత్వం ఉన్నవారినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాలి.

Tags:    

Similar News