Cakes: ఈ కేకులు తినొద్దు..అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
Cakes: ఇంట్లో ఏం సందర్భం అయినా ఇప్పుడు కేక్ కట్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి చిన్న సందర్భానికి కేట్ ఉండాల్సిందే..కట్ చేయాల్సిందే. అయితే ఈ కేకులను ఇలా ఇష్టమొచ్చనట్లు తినేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
Cakes: ఈ కేకులు తినొద్దు..అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు
Cakes: ఇంట్లో ఏం సందర్భం అయినా ఇప్పుడు కేక్ కట్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి చిన్న సందర్భానికి కేట్ ఉండాల్సిందే..కట్ చేయాల్సిందే. అయితే ఈ కేకులను ఇలా ఇష్టమొచ్చనట్లు తినేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్ వెల్ వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లు ఇష్టంగా తినేవాళ్లు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని అంటున్నారు.
కేకులంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా కూల్ కేకులంటే అందరికీ నోరూరుతుంది. ఇక ఇంట్లో ఏదో ఒక సందర్భం రావడం లేదా ఏదో ఒక సందర్భానికి ఎవరో ఒకరు పిలవడం, కేకులు కట్ చేయడంతో కేకులను పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తినేస్తుంటారు. అయితే ఈ కేకులలో వేసే రసాయనాలతో క్యాన్సర్ ముప్పు ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా వెల్ వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లు కేకులు తిన్నవారు తొందరగా అనారోగ్యం పాలవుతున్నారని, వారిలో క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఏయే కేకులు తింటే క్యాన్సర్ వస్తోంది?
ఇటీవల జరిపిన అధ్యయనాల్లో దాదాపు 12 రకాల కేకుల్లో క్యాన్సర్ కలిగించే కారకాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. వాటిలో వాడే రంగులు ప్రమాదకరంగా మారాయి. ఈ 12 రకాల కేకుల్లో ఎక్కువ రంగులు వాడారు. అంటే రంగులు ఎక్కువ ఉన్న కేకులు తినడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఈ రంగులు ఏంటంటే.. అల్లూరా రెడ్, సన్ సట్ యెల్లో ఎఫ్ సీఎఫ్, పోన్సెయూ 4 ఆర్, టారాట్రైజైన్, కార్మోయుసన్ వంటి రంగులు ఉన్న కేకులు తినకూడదు. ముఖ్యంగా రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ లలో రంగులు ఎక్కువగా వాడతారు.. ఈ రెండు రకాల కేకుల్లో అన్నింటి కంటే ఎక్కువ క్యాన్సర్ కారకాలు ఉంటాయి.
ఎలాంటి రసాయనాలు ఉంటాయి?
కేకుల్లో కామన్‌గా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈస్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కొన్ని కేకుల్లో కృత్రిమ రంగులు వాడుతున్నారు. ఈ కృత్రిమ రంగుల వల్ల కేక్ అందంగా కనిపించడమే కాకుండా రుచిగా ఉంటుంది. అదేవిధంగా ప్రిజర్వేటివ్ వాడటం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. రెడ్ వెల్వెట్‌లో వాడే అలూరా రెడ్ వెరీ డేంజర్. బ్లాక్ ఫారెస్ట్‌లో వడే పాంసో 4ఆర్, సన్ సెట్ ఎల్లో లు క్యాన్సర్ కారకాలకు కారణమవుతున్నాయి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి?
కేకులో వాడే రసాయనాన్ని బట్టి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రెడ్ వెల్వెట్ తింటే అలర్జీ, ఆస్తమా, జీర్ణక్రియ సమస్యలు, తలనొప్పి వస్తుది. అలాగే బ్లాక్ ఫారెస్ట్ తింటే అలర్జీ, హైపర్ యాక్టివిటీ, క్రోమోజోమ్ డ్యామేజ్, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్‌లలో వాడే పొనుయా 4ఆర్ పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అలర్జీ, ఆస్తమా వస్తుంది. అలాగే టార్గాజైన్, కార్మొసియాన్ వంటి రసాయనాలు వాడే కేకులు తింటే చర్మంపై వాపులు, శ్వాస ఇబ్బందులు, ఒత్తిడి, తలనొప్పి, నిద్ర తగ్గిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.