BP Patients: బీపీ ఉన్న వారు వీటికి దూరంగా ఉండకపోతే.. హార్ట్ ఎటాక్ తప్పదు
BP: బీపీ ఉన్న వారు వీటికి దూరంగా ఉండకపోతే.. హార్ట్ ఎటాక్ తప్పదు
Healh Tips for BP Patients: గుండెపోటు రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. బీపీ ఒక్కసారిగా అటాక్ అయితే చాలు అదుపులోకి రావడం అంత సులభమైన విషయం కాదు. అందుకే బీపీ కంట్రోల్‌లో ఉంచుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. ముఖ్యంగా తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటారు. రక్తపోటు ఉన్న వారు ఇలాంటి ఫుడ్‌కు దూరంగా ఉండాలని లేదంటే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ రక్తపోటు వచ్చిన వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిప్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారాలలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అందువల్ల, ఈ రకమైన ఆహారాలను తగ్గించడం ఉత్తమం. అలాగే రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి పానీయాలలో ఉన్న కేఫీన్ రక్తపోటును పెంచే అవకాశం ఉంటుంది. అందుకే బీపీ ఉన్న వారు వీటిని మితంగా తీసుకోవాలి. అధికంగా ఆల్కహాల్ సేవించడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీపీ ఉన్న వారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండమని చెప్పేది ఇందుకే.
బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో సోడియం, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును పెంచే ప్రమాదం ఉంది. అందువల్ల, ఈ రకమైన ఆహారాలను తగ్గించడం ఉత్తమం. ప్రాసెస్డ్ మీట్‌లో అధికంగా కొవ్వు ఉంటుంది. ఇవి కూడా రక్తపోటును పెంచుతాయి. చీజ్‌లో ఉండే సోడియం, కొవ్వు రక్తపోటును పెంచుతాయ. అందువల్ల, చీజ్ వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. ఇక రక్తపోటు బారిన పడ్డవారు నిల్వ పచ్చళ్లను వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ఉప్పు ఎక్కువగా వేస్తుంటారు. అందుకే వీటిని దూరం పెట్టాలి.
రెడీ-టు-ఈట్ ఫుడ్స్‌లో ఉన్న సోడియం రక్తపోటును పెంచే అవకాశం ఉంది. అందువల్ల, ఈ రకమైన ఆహారాలను తగ్గించడం మంచిది. పేస్ట్రీలలో ఉండే చక్కెర, కొవ్వు రక్తపోటును పెంచుతాయి. అందుకే రక్తపోటుతో బాధపడేవారు పేస్ట్రీలు, బ్రెడ్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటితో పాటు యోగా, మెడిటేషన్ వంటి వాటిని కచ్చితంగా అలవాటు చేసుకోవాలి.