Cuminum Seeds: బౌన్సీ హెయిర్ కోసం నల్లజీలకర్ర

Cuminum Seeds: హెర్ ని బౌన్సీగా ఉంచడంలో నల్ల జీలకర్ర పేస్టు బాగా పనిచేస్తుంది.

Update: 2021-04-06 15:12 GMT

Black Cumin:(Photo wikipedia)

Cuminum Seeds: జీలకర్ర ఇది మనందరికీ తెలిసినదే. జీలకర్రలో రెండు రకాలు ఉన్నాయి. ఒక సాధారణ జీలకర్ర, రెండోది నల్ల జీలకర్ర(చేదు జీలకర్ర). మన వంటల్లో సాధారణ జీలకర్రనే వాడుతుంటాము. జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి. నల్లజీలకరలో విటమిన్ బి1, బి2, బి3లతో పాటు కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాపర్, జింక్ పాస్పరస్ మొదలైన పోషకాలు కలిగి వుంటుంది. ఈ నల్ల జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సప్లమెంటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా ఎలాంటి ఉపయోగాలు ఉన్నయో మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

హెర్ ని బౌన్సీగా ఉంచడంలో నల్ల జీలకర్ర పేస్టు బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా చుండ్రు, దురదలు తలలో పుండ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. జట్టు చివర్లు చిట్లడం, పొడిబారడం వంటి సమస్యలు మాయమైపోతాయి. నల్లజీలకర్రను తీసుకోవడం వల్ల శరీరంలో ఉత్పన్నమయ్యే ఇన్సులిన్ ను క్రమబద్దీకరిస్తుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ సరి చేస్తుంది. అస్తవ్యవస్తమైన జీర్ణ వ్యవస్థను సరిచేయడానికి నల్ల జీలకర్ర సహకరిస్తుంది. కాలేయం, మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు నల్లజీలకర్రను వేయించి మగ్గిన అరటిపండుతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది.

జీలకర్ర విటమిన్ E'ని ఎక్కువగా కలిగి ఉండటం వల్ల, యాంటీ-ఏజింగ్'గా పనిచేసి చర్మం పైన ముడతలు రాకుండా చేస్తుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల చర్మం పైన వచ్చే ముడతలను తేప్పించే ఫ్రీ రాడికల్స్'కి వ్యతిరేకంగా పనిచేస్తుంది. జీలకర్ర రోగ నిరిధక శక్తిని పెంచుతుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని మరియు ఫ్రీ రాడికల్స్'ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం

Tags:    

Similar News