Health: బీట్‌రూట్ మంచిదే.. కానీ వీళ్లకు మాత్రం విషంతో సమానం
Beetroot Benefits and Side Effects: బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Health: బీట్‌రూట్ మంచిదే.. కానీ వీళ్లకు మాత్రం విషంతో సమానం
Beetroot Benefits and Side Effects: బీట్‌రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రక్తహీనత (అనీమియా) సమస్య ఉన్నవారు దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల లాభం ఉంటుంది. ఇక బీట్‌రూట్ రసం శరీరాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని అధికంగా తీసుకుంటే, అది దుష్ప్రభావాలను కలిగించవచ్చు. ఇంతకీ బీట్‌రూట్‌ను ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
* బీట్‌రూట్‌లో ఆక్సలేట్ అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. మూత్రపిండ రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు బీట్‌రూట్‌ను పూర్తిగా నివారించాలి.
* బీట్‌రూట్ రసంలో నైట్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇది రక్తపోటు తగ్గడానికి కారణమవుతుంది. కాబట్టి లో బీపీతో బాధపడేవారు బీట్‌రూట్‌కు దూరంగా ఉండడమే మంచిది.
* బీట్‌రూట్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉన్నా, ఇందులో సహజ చక్కెర పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మధుమేహ రోగులు దీన్ని అధికంగా తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయులు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల, మితంగా మాత్రమే తీసుకోవాలి.
* బీట్‌రూట్ ఐరన్ సమృద్ధిగా కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా రక్తహీనత ఉన్నవారికి మంచిది. కానీ హిమోక్రోమాటోసిస్ (శరీరంలో అధిక ఐరన్ నిల్వలు ఉండే స్థితి) ఉన్నవారు దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల ఇనుము స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
* బీట్‌రూట్‌లో అధికంగా ఉండే ఫైబర్ కొందరికి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కలిగించవచ్చు. ముఖ్యంగా, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారు దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది.
* అలర్జీలతో బాధపడేవారు కూడా వీటికి దూరంగా ఉండాలి. దద్దుర్లు, దురద, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు తక్కువగా తీసుకోవాలి.
నోట్: ఈ వివరాలను ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.