Cardiac Arrest : 40 ఏళ్లకే గుండెపోటు.. యువతలో పెరుగుతున్న కార్డియాక్ అరెస్టులు.. కారణమేంటి?
ప్రస్తుత జీవనశైలి కారణంగా యువతలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 30-40 ఏళ్ల వయసున్న యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం సాధారణంగా మారింది. తాజాగా బెంగళూరులో ఒక విషాద ఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి తన మేనేజర్‌కు వెన్నునొప్పిగా ఉందని మెసేజ్ పంపి, కేవలం పది నిమిషాల్లోనే గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటనను ఆ ఉద్యోగి మేనేజర్ తన ఎక్స్ అకౌంట్‌లో పంచుకున్నాడు. మృతి చెందిన ఉద్యోగి పేరు శంకర్ అని సమాచారం.
Cardiac Arrest : 40 ఏళ్లకే గుండెపోటు.. యువతలో పెరుగుతున్న కార్డియాక్ అరెస్టులు.. కారణమేంటి?
Cardiac Arrest : ప్రస్తుత జీవనశైలి కారణంగా యువతలో గుండెపోటు కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 30-40 ఏళ్ల వయసున్న యువకులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం సాధారణంగా మారింది. తాజాగా బెంగళూరులో ఒక విషాద ఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి తన మేనేజర్‌కు వెన్నునొప్పిగా ఉందని మెసేజ్ పంపి, కేవలం పది నిమిషాల్లోనే గుండెపోటుతో మరణించాడు. ఈ విషాద ఘటనను ఆ ఉద్యోగి మేనేజర్ తన ఎక్స్ అకౌంట్‌లో పంచుకున్నాడు. మృతి చెందిన ఉద్యోగి పేరు శంకర్ అని సమాచారం.
కె.వి. అయ్యర్ అనే మేనేజర్ తన పోస్ట్‌లో ఇలా రాశాడు.. "నా సహోద్యోగి శంకర్ ఉదయం 8:37 గంటలకు నాకు మెసేజ్ పంపాడు. సార్, నాకు చాలా వెన్నునొప్పిగా ఉంది. ఈరోజు నేను ఆఫీస్‌కు రాలేను. దయచేసి సెలవు ఇవ్వండని అడిగాడు. ఇలాంటి సెలవు అభ్యర్థనలు సాధారణమే కాబట్టి నేను సరే, విశ్రాంతి తీసుకో అని చెప్పాను."
"ఉదయం 11 గంటలకు నాకు దిగ్భ్రాంతికరమైన ఫోన్ కాల్ వచ్చింది. శంకర్ మరణించాడని ఫోన్ చేసినవారు తెలిపారు. మొదట నేను నమ్మలేకపోయాను. అతని ఇంటి అడ్రెస్ తీసుకొని అక్కడికి వెళ్ళాము. అతను అప్పటికే చనిపోయాడు." అని కె.వి. అయ్యర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
శంకర్ వయసు 40 సంవత్సరాలు. అతను చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేవాడు. అతను సిగరెట్ లేదా మద్యం సేవించేవాడు కాదు. అయినప్పటికీ అతనికి గుండెపోటు రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. నటుడు పునీత్ రాజ్‌కుమార్ వంటి చాలా మంది ఫిట్‌గా ఉండే యువకులు కూడా ఈ విధంగా కార్డియాక్ అరెస్ట్ లేదా గుండెపోటుతో చనిపోవడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది.
"పూర్తిగా స్పృహతో ఉన్న ఒక వ్యక్తి మెసేజ్ పంపి, తర్వాత కేవలం పది నిమిషాల్లోనే చివరి శ్వాస విడిచాడు అంటే చాలా షాక్‌గా అనిపిస్తుంది. జీవితం ఎంత అనిశ్చితమైనదో ఇది మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో తదుపరి క్షణం ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ చుట్టూ ఉన్న ప్రజలతో దయగా ఉండండి. జీవితం ఉన్నంతవరకు సంతోషంగా ఉండండి" అని అయ్యర్ తన పోస్ట్‌లో రాశాడు. ఈ సంఘటన యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్న తీరును, జీవితం అనిశ్చితత్వాన్ని సూచిస్తుంది.