Banana: అరటిపండ్లని ఇతర పండ్లతో నిల్వ చేయకూడదు.. ఎందుకంటే..?

Banana: అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి...

Update: 2022-01-04 09:30 GMT

Banana: అరటిపండ్లని ఇతర పండ్లతో నిల్వ చేయకూడదు.. ఎందుకంటే..?

Banana: అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సామాన్యులకు తక్కువ ధరలో దొరికే ఏకైక పండు అరటి మాత్రమే. పిల్లలకు అన్ని పోషకాలను అందిస్తుంది. అంతేకాదు అరటిని తినడానికి మాత్రమే కాకుండా వంటలలో, బ్యూటి ప్రొడాక్ట్స్‌లో కూడా ఉపయోగిస్తారు. స్వీట్లు కూడా చేస్తారు. అయితే అరటి పండ్లని ఇతర పండ్లతో కలిపి ఎప్పుడు నిల్వ చేయకూడదని అంటారు. దీనికి కారణాలు చాలా ఉన్నప్పటికి అసలు వాస్తవాలు మాత్రం ఎవ్వరికి తెలియవు. అవేంటో తెలుసుకుందాం.

సాధారణంగా అరటిపండ్లని ఇతర పండ్లతో ఉంచుతారు కానీ సైన్స్ కోణం నుంచి చూస్తే అది కరెక్ట్‌ కాదు. అరటిపండ్ల నుంచి ఈథేన్ గ్యాస్ వెలువడుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ వాయువు మండుతుంది. అరటిపండు పక్వానికి రావడానికి ఇదే కారణం. దీనివల్ల ఈ వాయువు ఎఫెక్ట్ ఇతర పండ్లపై కూడా పడుతుంది. దీంతో అవి తొందరగా పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అరటిపండు నుండి వెలువడే వాయువు అందులో ఉండే స్టార్చ్‌ని చక్కెరగా మారస్తుంది. అందుకే దానిలో తీపి పెరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అది మరింత పక్వానికి వస్తుంది.

ఇతర పండ్లు వాటి దగ్గరగా ఉంటే అవి కూడా పక్వానికి వస్తాయి. వాయువు ప్రభావం వల్ల ఇలా జరుగుతుంది.అయితే అరటిపండ్ల చుట్టు ఉన్న పండ్లని పక్వానికి వస్తాయ అంటే చాలా పండ్లు ఈ వాయువు ప్రభావానికి గురవుతాయి. ఉదాహరణకు అరటిపండుతో ఆపిల్, బేరిని ఉంచిన తర్వాత అవి కొన్ని గంటల తర్వాత పండినవిగా కనిపిస్తాయి.

అదే సమయంలో నారింజ, నిమ్మకాయలు, ఈథేన్ గ్యాస్కి ప్రభావితం కావు. ఇవి తాజగానే ఉంటాయి. అరటిపండులో పాలీఫెనాల్ ఆక్సిడేస్ ఎంజైమ్ కనిపిస్తుంది. ఈ ఎంజైమ్ అరటిపండ్లలో ఉండే ఫినాలిక్ రసాయనాన్ని ఆక్సిజన్ సహాయంతో క్వినోన్‌లుగా మారుస్తుంది. ఆక్సిజన్‌తో ప్రతిచర్య తర్వాత అరటి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది.

Tags:    

Similar News