Balanced diet: వృద్దాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే.. ఈ మూడు అలవాట్లు చేసుకోండి
Balanced diet: ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ దానికోసం ప్రయత్నించేవారు కొంతమందే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని, అప్పుడే ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు.
Balanced diet: వృద్దాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే.. ఈ మూడు అలవాట్లు చేసుకోండి
Balanced diet: ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ దానికోసం ప్రయత్నించేవారు కొంతమందే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద పెట్టాలని, అప్పుడే ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడకుండా ఉంటారని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని అలవాట్లు చేసుకోవడం వల్ల వృద్ధాప్య చాయలు కూడా కనిపించవని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమందిని చూస్తే చిన్న వయసులోనే పెద్ద వాళ్లలా కనిపిస్తారు. నెరిసిన జుట్టు, ముడతల చర్మ, పాలిపోయిన ముఖం, కుంగిపోయిన శరీరం. చిన్నవయసే కానీ వృద్ధాప్య ఛాయలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి ఛాయలు కనిపించడానికి కారణం వారు ఆరోగ్యంపై సరైన శ్రద్ద పెట్టకపోవడం. ముఖ్యంగా సరైన అలవాట్లు లేకపోవడం.
సరైన ఆహారం తీసుకోవాలి
ఆరోగ్యంగా ఉండడానికే కాదు అందంగా ఉండాలన్నా సమతుల్య ఆహారం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. ఒక క్రమబద్దమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శక్తితో పాటు సరైన పెరుగుదల ఉంటుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. స్వీట్లు, ప్యాకెట్ ఫుడ్, ఐస్ క్రీములు వంటి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.
నిద్ర చాలా అవసరం
ప్రతి ఒక్కరు రోజుకు 7 నుంచి 9 గంటల వరకు నిద్రపోవాలి. డీప్ స్లీప్.. ఎటువంటి అనారోగ్యాన్ని అయినా సరిచేస్తుంది. అదేవిధంగా లెస్ స్లీప్.. ఎంత ఆరోగ్యంగా ఉన్నా పాడు చేస్తుంది. అందుకే సరైన నిద్ర ప్రతి ఒక్కరికీ అవసరం. దీనివల్ల మానసికంగా.. శారీరకంగా ధృడంగా ఉంటారు. మెమొరీ పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ శరీరంలో సరిగ్గా ఉండాలంటే కూడా నిద్ర చాలా అవసరం. లేదంటే ఎటువంటి జబ్బులైనా తొందరగా ఎటాక్ అవుతాయి. నిద్రపోయే మూడు గంటల ముందు డిన్నర్ తినాలి.
వ్యాయామం తప్పనిసరి
రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. ఇందులో నడక, సైక్లింగ్, డ్యాన్స్ ...ఇలాంటివి ఏమీ ఉన్నా శరీరం ఆరోగ్యంగా... ఉత్సాహంగా ఉంటుంది. వ్యాయామం గుండెను బలోపేతం చేస్తుంది. అలాగే మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా అంటు వ్యాధుల నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది.