Avoid doing these after having a meal: అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు మాత్రం చేయకండి..చేశారో ఇక అంతే

Avoid doing these after having a meal: అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నాన్ని మొక్కుకుని తింటుంటారు. అయితే అన్నం తిన్న తర్వాత కొన్ని పనులు అసలు చేయకూడదు.

Update: 2025-07-19 10:10 GMT

Avoid doing these after having a meals: అన్నం తిన్న తర్వాత ఈ 5 పనులు మాత్రం చేయకండి..చేశారో ఇక అంతే

Avoid doing these after having a meals: అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందుకే అన్నాన్ని మొక్కుకుని తింటుంటారు. అయితే అన్నం తిన్న తర్వాత కొన్ని పనులు అసలు చేయకూడదు. ఒకవేళ చేశారో.. ఇక అంతే సంగతులు. అనారోగ్యం పాలై మంచాన పడతారని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఐదు పనులేంటో చూద్దాం.

మన చుట్టు ఉన్నవాళ్లలో చాలామంది అన్నం తిన్న వెంటనే ఒక కునుకు వేస్తుంటారు. మరికొంతమంది టీలు, కాఫీలు తాగుతుంటారు. ఇంకొంతమంది స్వీట్లు తింటారు. అసలు అన్నం తిన్న తర్వాత ఇలా ఏదైనా తినొచ్చా? తినకూడదా? అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా అన్నం తర్వాత ఏదో ఒకటి తింటూ ఉంటారు. అసలు అన్నం తిన్న తర్వాత ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

నిద్ర

చాలామంది అన్నం తిన్న తర్వాత కాసేపు నిద్రపోతారు. ఆ తర్వాత లేచిన తర్వాత మళ్లీ ఏదో ఒకటి తింటారు. చాలామంది ఎలా ఫీల్ అవుతారు అంటే నిద్రపోతే అన్నం అరిగిపోతుందని. నిజమే మీ శరీరం నిద్రపోవడం వల్ల రెస్ట్ తీసుకుంటుంది. కానీ డైజెషన్ సిస్టమ్ రెస్ట్ తీసుకోదు. నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. దీనివల్ల చాలా జబ్బులు వస్తాయి. అంతేకాదు అన్నం తిన్న వెంటనే నిద్రపోతే పొట్టలో యాసిడ్ పెరుగుతుంది. ఇది పొట్టలో నొప్పి, మంటను కలిగిస్తుంది. అందుకే తిన్న వెంటనే నిద్రపోకూడదు. అయితే కచ్చితంగా రెస్ట్ తీసుకోవాలని మీరు అనుకుంటే చెయిర్‌‌లో కూర్చుని నిద్రపోవాలి. అంటే మీ శరీరం నిలబడి ఉండాలి.

సిగెరట్ తాగడం

చాలామంది పనులకు వెళ్లేవాళ్లు, ఆఫీసులకు వెళ్లేవాళ్లు తిన్న వెంటనే దమ్ముకొడుతుంటారు. ఇలా చేస్తే వారికి ఆహారం ఈజీగా అరిగిపోతున్న ఫీలింగ్, అన్నం తిర్వాత సిగరెట్ తాగితే ఫుల్ మీల్స్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే సిగరెట్ తాగడం వల్ల అది మీ కడుపుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాదు మీరు తిన్న ఆహారాన్ని డైజెషన్ కాకుండా చేస్తుంది. ఒక సిగరెట్ కాల్చినా కూడా అంతే ప్రభావం చూపుతుంది. ఇక ఎక్కువ సిగరెట్లు కాలిస్తే మీ ఊపిరితిత్తులు ప్రమాదంలో పడ్డాయని అర్ధం.

పరుగులు

అన్నం తిన్న తర్వాత చాలామంది ఏదో అన్నం అరిగిపోతుందని, అలాగే సన్నగా అయిపోవాలని ఫాస్ట్‌గా వాకింగ్ చేసేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సన్నగా కావడం కంటే ప్రమాదకరమైన జబ్బుల భారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరుగు పరుగున నడిచే నడక నిజంగా డైజెషన్‌పై ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు తిన్న వెంటనే నడవడం వల్ల మీ మజిల్స్ డైజెషన్‌తో పోటీ పడతాయి. దీంతో తిన్నది అరగదు. ఒకవేళ నిజంగా మీకు నడవాలని అనిపిస్తే చాలా నెమ్మదిగా నడవాలి. కాస్త ఫ్రెష్ గాలిని పీల్చుకుంటూ నడిస్తే మంచి డైజెషన్ ఉంటుంది.

తిన్న తర్వాత కాఫీ తాగుతున్నారా?

తిన్న తర్వాత టీ, కాఫీలు తాగితే అవి మీ శరీరంలోని ఐరన్ వంటి మినరల్స్‌ని పీల్చేసుకుంటాయి. ముఖ్యంగా మీరు ఐరన్, ప్రోటీన్‌కు సంబంధించిన ఆహారం గనక తింటే టీ అసలు తాగకూడదు. దీనివల్ల డైజెషన్ సిస్టమ్‌పైన ప్రభావం పడటమే కాదు తిన్న ఆహారం అరగకుండా లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Tags:    

Similar News