Health Tips: డయాబెటీస్‌ రోగులకి ఈ ఆకుపచ్చ పండు దివ్యఔషధం.. చక్కటి ఫలితాలు..!

Health Tips: డయాబెటీస్‌ రోగులకి ఈ ఆకుపచ్చ పండు దివ్యఔషధం.. చక్కటి ఫలితాలు..!

Update: 2023-01-29 14:00 GMT

Health Tips: డయాబెటీస్‌ రోగులకి ఈ ఆకుపచ్చ పండు దివ్యఔషధం.. చక్కటి ఫలితాలు..!

Health Tips: భారతదేశంలో రోజు రోజుకి డయాబెటీస్‌ పేషెంట్లు పెరిగిపోతున్నారు. దీనివల్ల అనేక ఇతర రోగాల బారినపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ద వహించకపోతే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కచ్చితంగా రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకోవాలి. దీనికోసం సరైన డైట్‌ పాటించాలి. ముఖ్యంగా కొన్ని పండ్లని తీసుకోవడం వల్ల చక్కెర శాతం అదుపులో ఉంటుంది. వీటి ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కానీ పోషక విలువలకి లోటు ఉండదు. అలాంటి పండ్లలో ఆవకాడో ఒకటి. ఇది డయాబెటీస్‌ రోగులకి దివ్యఔషధమని చెప్పవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో అవకాడోను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్సులిన్ ఉత్పత్తిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అవకాడోలో కార్బోహైడ్రేట్ పరిమాణం తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు కారణంగా బరువు పెరగరు. ఫిట్‌గా కనిపిస్తారు. ఊబకాయం అనేక వ్యాధులకు కారణం కాబట్టి దీనిని నివారించడానికి తప్పనిసరిగా అవకాడో తినాలి.

అవకాడోను క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తుల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం తగ్గుతుంది. ఎందుకంటే శరీరానికి హాని కలిగించని ఆరోగ్యకరమైన కొవ్వు ఇందులో ఉంటుంది. అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు. మన కళ్ల ఆరోగ్యం బాగుండాలంటే అవకాడోను తప్పక తినాలి. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. కావాలంటే దీన్ని అల్పాహారంలో కూడా చేర్చుకోవచ్చు. కొంతమంది అవకాడోను సలాడ్‌ రూపంలో తినడానికి ఇష్టపడతారు.ఈ రోజుల్లో మధ్య వయస్కులు, వృద్ధులు మాత్రమే కాకుండా యువత కూడా బలహీన ఎముకల సమస్యని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో అవకాడో తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.

Tags:    

Similar News