Gas Tablets: గ్యాస్‌కి సంబంధించి ట్యాబ్లెట్లు వాడుతున్నారా.. సైడ్‌ ఎఫెక్స్‌ తెలుసుకోండి..!

Gas Tablets: నేటి కాలంలో చాలామంది గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే వీటికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు.

Update: 2024-02-20 16:00 GMT

Gas Tablets: గ్యాస్‌కి సంబంధించి ట్యాబ్లెట్లు వాడుతున్నారా.. సైడ్‌ ఎఫెక్స్‌ తెలుసుకోండి..!

Gas Tablets: నేటి కాలంలో చాలామంది గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే వీటికి సంబంధించిన ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. నిజానికి ఒకేచోట గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు, చెడు ఆహారపదార్థాలు ఎక్కువగా తినేవాళ్లు, ఆహారం విషయంలో సమయపాలన పాటించని వాళ్లు తరచుగా గ్యాస్‌బారిన పడుతారు. ఈ రోజుల్లో జంక్ ఫుడ్ తినే అలవాటు మనుషులను అనారోగ్యానికి గురి చేస్తోంది. మైదా, సంతృప్త కొవ్వు, ఉప్పు నిరంతర వినియోగం వల్ల ప్రజల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుది. దీని కారణంగా ప్రజలు చిన్న వయస్సులోనే ఎసిడిటీ, గ్యాస్ బారిన పడుతున్నారు. కానీ అన్నిటికి ట్యాబ్లెట్లు పరిష్కారం కాదు. వీటివల్ల మరిన్ని సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయి.

పరగడుపున ట్యాబ్లెట్లు వేసుకోవద్దు

గ్యాస్, ఎసిడిటీ నుంచి బయటపడేందుకు చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో గ్యాస్, ఎసిడిటీ మందులు వాడుతున్నారు. కొంతమంది దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్నారు. ఇది లేకుండా వారికి రోజు గడవదు. అయితే ఇలాంటి వారిలో బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి.

• అతిసారం

• నోరు పొడిబారడం

• అపానవాయువు, గ్యాస్ ఏర్పడటం

• ఫ్లూ

• వెన్నునొప్పి

• బలహీనత వంటి లక్షణాలు ఉంటాయి.

గ్యాస్ నుంచి ఉపశమనం పొందడానికి నివారణలు

గ్యాస్, ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందాలంటే మందులపై ఆధారపడకుండా ఇంటి నివారణల సాయం తీసుకోవాలి. సోంపు గ్యాస్‌ను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో దీనిని తినవచ్చు. ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆహారంలో ఆకుకూరల తీసుకోవడం పెంచాలి. బయటి ఆహారం తక్కువగా తినడానికి ప్రయత్నించండి. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పెరుగు వంటివి తరచుగా తీసుకోవాలి. పచ్చి కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. తిన్న తర్వాత కొద్దిసేపు నడవాలి. వెంటనే పడుకోకూడదు. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. రోజూ 7నుంచి 8 గంటలు నిద్రపోవాలి.

Tags:    

Similar News