Dandruff: చుండ్రు బాధితులకి సహజ నివారణ.. శాశ్వత పరిష్కారం..!

Dandruff: చుండ్రు బాధితులకి సహజ నివారణ.. శాశ్వత పరిష్కారం..!

Update: 2022-11-22 04:31 GMT

Dandruff: చుండ్రు బాధితులకి సహజ నివారణ.. శాశ్వత పరిష్కారం..!

Dandruff: చలికాలంలో చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. దీనివల్ల ఒత్తుగా ఉన్న జుట్టు పాడవుతుంది. కొన్నిసార్లు దుస్తులపై పడి ఇబ్బంది కలిగిస్తుంది. చుండ్రు కారణంగా జుట్టు దువ్వడం చాలా కష్టం. మీరు ఎంత ఖరీదైన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడినా చుండ్రు పూర్తిగా తొలగిపోదు. మళ్లీ వచ్చేస్తుంది. అయితే కొన్ని సహజ పద్ధతుల ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం

నిమ్మరసం చుండ్రు సమస్యను దూరం చేస్తుంది. నిమ్మరసంలో ఆవనూనె కలిపి అప్లై చేయడం వల్ల చుండ్రు నుంచి విముక్తి పొందవచ్చు. ఈ మిశ్రమంతో కొద్దిసేపు తలని మసాజ్ చేయాలి. కొన్ని గంటలపాటు అలాగే ఉంచి తర్వాత కడగాలి. మీరు మొదటి సారి నుంచే ప్రయోజనాన్ని పొందడం గమనిస్తారు.

ముల్తానీ మిట్టి, వెనిగర్

ముల్తానీ మట్టి జుట్టుకు మేలు చేస్తుంది. పూర్వకాలంలో ముల్తానీ మట్టితో జుట్టును కడిగేవారు. ముల్తానీ మట్టిలో యాపిల్ పళ్లరసం కలిపి జుట్టుకి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సమస్య శాశ్వతంగా దూరమవుతుంది.

పెరుగు, బేకింగ్ సోడా

బేకింగ్ సోడాలో పెరుగును కలిపి అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఒక కప్పు పెరుగులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపాలి. దీనిని జుట్టకి అప్లై చేయాలి. దీంతో చుండ్రు శాశ్వతంగా పోతుంది. అంతేకాదు జుట్టుకి మెరుపు కూడా వస్తుంది.

వేప, తులసి

వేప, తులసి ఆకులు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. నీళ్లలో వేప, తులసి వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత జుట్టును కడగాలి. ఇలా చేస్తే చుండ్రు శాశ్వతంగా తొలగిపోతుంది.

Tags:    

Similar News