మంచి ఆహారం తీసుకుంటున్నా మీకు మజిల్స్ రావడం లేదా? అయితే ఈ సారి ఈ ఆహారాలు తినండి
శరీరం గట్టిగా, బలమైన మజిల్స్ ఉండాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవారు ఎక్కువగా తిరిగిన కండలు ఉండాలని ఆశపడుతుంటారు. దానికోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు కూడా చేస్తుంటారు.
మంచి ఆహారం తీసుకుంటున్నా మీకు మజిల్స్ రావడం లేదా? అయితే ఈ సారి ఈ ఆహారాలు తినండి
శరీరం గట్టిగా, బలమైన మజిల్స్ ఉండాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా జిమ్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవారు ఎక్కువగా తిరిగిన కండలు ఉండాలని ఆశపడుతుంటారు. దానికోసం జిమ్‌లో గంటల తరబడి వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అంతేకాదు మజిల్స్ ని పెంచే ఆహారాన్ని కూడా తీసుకుంటారు. కానీ చాలామందికి మంచి ఆహారం తిన్నా మజిల్స్ పెరగవు..ఇలాంటి వాళ్లు ఈ సారి ఈ ఆహారాన్ని తింటే మీ మజిల్స్ పెరగడాన్ని మీరే గమనిస్తారు.
కాటేజ్ చీజ్
కాటేజ్ సీజ్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తులకు అవసరం. ముఖ్యంగా ఇందులో ఉండే కేసైన్ ప్రొటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఇది కండరాలకు ఎక్కువ సేపు అమైనో అమ్లాలను అందిస్తుంది. అంతేకాదు కాటేజ్ చీజ్‌లో ఉండే కాల్షియం, విటమిన్ బి12, ఇతర పోషకాలు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి.
లెంటిల్స్
పప్పుధాన్యాలు లేదా కాయధ్యానాలను లెంటిల్స్ అని పిలుస్తారు. వీటిని ఎక్కువగా తినడం శరీరం ధృడంగా మారుతుంది. కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే అధికమైన ప్రోటీన్లు కండరాల్లో మార్పు రాడానికి కారణమవుతాయి. వీటిలో ఇంకా ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పోటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలకు బలాన్ని ఇచ్చి, వాటి సైజును పెంచడంలో తోడ్పడతాయి. ఇందులో ఉండే తక్కువ గ్లైసెమిక్ వ్యాయామాల సమయంలో శరీరానికి నిరంతరం శక్తిని ఇస్తుంది.
గ్రీక్ యోగర్ట్
కండరాల పెరుగుదలలో సహాయపడే ఆహారాల్లో గ్రీక్ యోగర్ట్ ఒకటి. ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇది వ్యాయామం చేసిన తర్వాత కండరాల నిర్మాణానికి అదేవిధంగా మరమ్మత్తులకు సహాయపడుతుంది. అలాగే ఇది 9 ముఖ్యమైన అమైనో అమ్లాలను కూడా కలిగి ఉంటుంది. ఇందులో లూసిన్, ఐసోలూసిన్, వాలైన్ అనే మూడు అత్యంత ముఖ్యమైన ఆమ్లాలు ఉన్నాయి. ఇవి కండరాల పెరుగులకు చాలా అవసరం పడతాయి.
గుమ్మడి విత్తనాలు
గుమ్మడి విత్తనాల్లో ఉండే మెగ్నీషియం కండరాల సంకోచం మరియు సడలింపులో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అదేవిధంగా వీటికి కండరాల నొప్పులు, తిమ్మిర్లు, కండరాల బలహీనతను కూడా నివారించే శక్తి ఉంది. ఈ విత్తనాల్లో దొరికే జింక్, ప్రోటీన్‌తో కండరాల పెరుగుదల ఉంటుంది.