Super Foods: కరోనా తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారా.. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Super Foods: కరోనా తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారా.. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Update: 2022-03-13 11:30 GMT

Super Foods: కరోనా తర్వాత జ్ఞాపకశక్తిని కోల్పోతున్నారా.. వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోండి..!

Super Foods: కరోనా తరువాత ప్రజలు అనేక రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది కొంతమందిలో జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది. ఇంకొందరు ఆందోళన, నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఎక్కువ సేపు ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే మానసిక ఆరోగ్యంపై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైట్‌లో వీటిని చేర్చుకోవడం ద్వారా మీ మనస్సును, మెదడుని షార్ప్‌గా చేసుకోవచ్చు.

1. గుమ్మడికాయ గింజలు- మెదడు ఆరోగ్యంగా చురుగ్గా ఉండటానికి గుమ్మడి గింజలు చాలా ఉపయోగపడుతాయి. ఈ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, కాపర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజలు మెదడుకు పూర్తి శక్తిని ఇస్తాయి. దీనివల్ల ఆలోచనా శక్తి పెరగడంతో పాటు మెదడు అభివృద్ధి కూడా బాగుంటుంది.

2. వాల్‌నట్స్- మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ప్రతిరోజూ వాల్‌నట్‌లను తినాలి. ఇందువల్ల బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది. వీటిలో విటమిన్ ఈ, కాపర్, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

3. గుడ్డు- గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉంటాయి. గుడ్డు శరీరం, మనస్సు రెండింటికీ గొప్ప ఆహారం. గుడ్లలో విటమిన్ బి, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ బి డిప్రెషన్, ఆందోళన నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతాయి. కాబట్టి కోలిన్ మెదడు శక్తిని పెంచుతుంది.

4. డార్క్ చాక్లెట్- డార్క్ చాక్లెట్ మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కోకోతో తయారైన డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీన్ని తినడం వల్ల ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ తొలగిపోతాయి.

Tags:    

Similar News