Thyroid Diet: థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. డైట్‌లో ఈ మార్పులు చేస్తే సమస్య దూరం..!

Thyroid Diet: నేటి కాలంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో చాలామంది అనేక రోగాలకి గురవుతున్నారు.

Update: 2023-06-24 04:42 GMT

Thyroid Diet: థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా.. డైట్‌లో ఈ మార్పులు చేస్తే సమస్య దూరం..!

Thyroid Diet: నేటి కాలంలో జీవనశైలి సరిగ్గా లేకపోవడంతో చాలామంది అనేక రోగాలకి గురవుతున్నారు. అందులో థైరాయిడ్‌ ఒకటి. దీనివల్ల ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతారు. థైరాయిడ్ అనేది గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి. ఇది హార్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల థైరాయిడ్‌ సమస్య ఎదురవుతుంది. దీనివల్ల శరీర బరువు వేగంగా పెరుగుతుంది. ఇది నయం కావాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

వ్యాయామం

శరీరానికి వ్యాయామం చాలా ముఖ్యం. దీనివల్ల బాడీ ఫిట్‌గా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.

ఒమేగా-3 రిచ్ డైట్

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే ఒమేగా-3 రిచ్ డైట్‌ తీసుకోవాలి. ఇందులో సోయాబీన్, గుడ్లు, వాల్‌నట్స్, చేపలు మొదలైనవి తినవచ్చు.

కెఫిన్

కెఫిన్ శరీరానికి చాలా హానికరం. థైరాయిడ్ సమస్య ఉంటే కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదికాదు. ఎందుకంటే కెఫిన్ శరీరంలో డీహైడ్రేషన్‌ను పెంచుతుంది. ఇది శరీరానికి హానికరం. థైరాయిడ్ సమస్యలు ఉంటే కెఫిన్ తీసుకోవడం మానుకోండి.

ఈ కూరగాయల తినవద్దు

థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను తినకూడదు. ఇవి థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో మార్పులని కలిగిస్తాయి.

Tags:    

Similar News