Mango: మామిడి పండు తింటున్నారా.? జాగ్రత్తగా లేకపోతే క్యాన్సర్ వస్తుంది
వేసవి రాగానే మామిడి పండ్లు గుర్తొస్తాయి.
Mango: మామిడి పండు తింటున్నారా.? జాగ్రత్తగా లేకపోతే క్యాన్సర్ వస్తుంది
వేసవి రాగానే మామిడి పండ్లు గుర్తొస్తాయి. ఎంత ఎండలు కొట్టినా మామిడి తినొచ్చని అందరూ సమ్మర్ కోసం ఎదురు చూస్తుంటారు. మామిడి పండు ‘ఫలాల రాజు’గా పేరుగాంచింది. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే మామిడి పండును తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తాజా మామిడి పండ్లలో విటమిన్ A, C, ఇనుము, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దృష్టి శక్తిని మెరుగుపరచడమే కాకుండా, చర్మానికి ఆరోగ్యాన్ని అందించి, జీర్ణవ్యవస్థను గాడిలో పెట్టగలవు. కానీ ఇవన్నీ సహజంగా పండిన మామిడి పండ్లకే వర్తిస్తాయి.
అన్ని వస్తువులు కల్తీగా మారుతోన్న ప్రస్తుత తరుణంలో మామిడి పండ్లను కూడా కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. త్వరగా పండ్లు కావాలని కొందరు వ్యాపారులు క్యాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను పూసి వేగంగా పక్వానికి తెస్తున్నారు. ఇది ఆరోగ్యానికి అత్యంత హానికరం.
క్యాల్షియం కార్బైడ్ వాడడం వల్ల పండ్లపై బూడిదరంగు పొర ఏర్పడుతుంది. దీనివల్ల ఆక్సిజన్‌తో కలిసే ఎసిటిలిన్ వాయువు విడుదలవుతుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇలాంటి పండ్లను తీసుకుంటే క్యాన్సర్, అల్సర్, లివర్, కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఇలాంటి పండ్లను తినడం వల్ల పేగులలో మంట, గ్యాస్, మలబద్ధకంతో పాటు.. తలనొప్పి, మత్తు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. చిన్న పిల్లల్లో శ్వాస సంబంధిత ఇబ్బందులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటివి కనిపిస్తాయి. నరాల బలహీనత, చేతులు కాళ్లు తిమ్మిర్లు రావడం వంటి సమస్యలు వస్తాయి.
ఎలా గుర్తించాలి.?
పండు పైభాగంలో బూడిద రంగు పొర ఉంటే అది రసాయనంతో పక్వానికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. సహజంగా పండిన మామిడికి మసక లేదు, వాసన తీపిగా ఉంటుంది. రసాయనాలతో పండిన పళ్లకు వాసన ఉండదు.
అందుకే మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రంగు, వాసనను చూసి ఎంచుకోవాలి. కాసేపు నీటిలో నానబెట్టి తినాలి. వీలైనంత వరకు నేరుగా మామిడి తోటల వద్ద కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలి.