Bitter Gourd: అమృతంలా పనిచేసే కాకరకాయ

Bitter Gourd: కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచడంతో పాటు, ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరనివ్వదు.

Update: 2021-04-08 03:07 GMT

Bitter Gourd:(Photo The hans India)

Bitter Gourd: కాకరకాయ అబ్బ ఎంత చేదో కదా... అస్సలు ఆ పేరు వింటేనే పారిపోయే వారు చాలా మందే వున్నారు. అదే స్థాయిలో కరకాయను ఇష్టపడే వారు కూడా వున్నారు. దానిలో వుండే చేదు చాలా మందిని దూరం చేసుకుంటోంది కాకరకాయ. ఆ చేదే మన ఆరోగ్యాన్ని కాపడుతుంది అంటే అతిశయోక్తి కాదు సుమా. నిజానికి కాకరకాయ రుచిలో చేదుగా ఉన్నప్పటికీ పోషక, ఔషధ, గుణాల్లో మాత్రం ఎంతో ఉత్తమమైనది అంటారు వైద్య నిపుణులు. కాకర కాయ కాలంతో సంబంధం లేకుండా కాస్తూనే వుంటుంది. పల్లెట్లూర్లలో ప్రతి ఇంటిలోనూ దర్శనం ఇస్తూనే వుంటుంది. కాకరలో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ ఉంటాయి. మరి అలాంటి కాకరకాయలో వుండే ఆరోగ్య రహస్యాలను మన "లైఫ్ స్టైల్" లో తెలుసుకుందాం.

కాకరకాయ శరీరంలోని వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. వీటిని ఉడికించిన నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్ల్లు దరిచేరవు. బీపీని కంట్రోల్‌లో ఉంచేందుకు కాకర ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్ధకం, లివర్, మూత్రపిండాల సమస్యలకు కూడా కాకర మంచి ఆహారం.

మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాలిన గాయాలను, పుండ్ల ను మాన్పడంలో కాకరకాయలోని గుణాలు బాగా పని చేస్తాయి. రక్తాన్ని శుధ్ధి పరిచి గుండె కు రక్త సరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకున్నా, శరీరం లో అనవసర కొవ్వు కరగాలన్నా కాకర రసం తాగాలి. కాకరలో ని యాంటీ ఆక్సిడెంట్ లు ఆరోగ్యాన్నీ కాపాడుతాయిఉదర సంబంధ వ్యాధులను కాకర మంచి ఔషధం. అందుకే రుచిలో చేదుగా ఉన్నాకాకరను తరచుగా తీసుకుంటే ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. శరీర కాంతిని మెరుగు పరుస్తుంది.

కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తలేమి(అనీమియా) కు పూటకు ఒక చెంచా కాకరాకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్థి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది.

కాకరకాయలు ముక్కలుగా కోసి ఎండబెట్టి వరుగు చేసి నిలువచేసుకొంటారు. ఈ వరుగు నేతితో వేయించుకొని తింటే చిరుచేదుగా ఉండి త్రిదోషాలను పోగోడుతుంది. కొన్ని ప్రాంతాలలో కాయలనే కాకుండా పండిన కాకరకాయలు ను కూడా కత్తిరించి వరుగు చేసి నిలువచేసుకుంటారు.  సో ఇంకెందుకు కాకర కాయను వివిధ రకాల వంటలను తయారు చేసుకుని మన  ఆహారంలో భాగం చేసుకుందాం ఇప్పటి నుండి.

Tags:    

Similar News