Women Health: మహిళలకి అలర్ట్‌.. గర్భసంచి తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Women Health: దేశంలో గర్భసంచి తొలగించుకుంటున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Update: 2022-12-15 15:00 GMT

Women Health: మహిళలకి అలర్ట్‌.. గర్భసంచి తొలగిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

Women Health: దేశంలో గర్భసంచి తొలగించుకుంటున్న మహిళల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సర్వసాధారణంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోంది. వాస్తవానికి గర్భం దాల్చకుండా ఉండేందుకు మహిళలు గర్భాశయ శస్త్రచికిత్స చేయించుకుంటున్నారు. హిస్టెరెక్టమీ అనేది ఒక రకమైన శస్త్ర చికిత్స. ఇందులో మహిళ గర్భాశయాన్ని తొలగిస్తారు. గత కొన్నేళ్లుగా ఈ సర్జరీ సర్వసాధారణమైపోయింది.

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ తంతు నడుస్తోంది. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీ ద్వారా ఈ శస్త్ర చికిత్స చేస్తున్నారు. దీనిని సర్జికల్ మెనోపాజ్ అని కూడా పిలుస్తారు. గర్భాశయ శస్త్రచికిత్స రెండు నుంచి మూడు గంటలు జరుగుతుంది. ఈ సర్జరీ తర్వాత స్త్రీలకు పీరియడ్స్ రావు. ఇది కాకుండా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, సర్విక్స్ క్యాన్సర్, గర్భాశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు గర్భాశయాన్ని తొలగిస్తారు.

ఇది తక్కువ ప్రమాదం ఉన్న శస్త్రచికిత్స. కానీ ఇది మహిళలందరికీ చేయవలసినది కాదు. దీనివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. గర్భాశయ శస్త్రచికిత్స తర్వాత పొత్తికడుపులో, ప్రైవేట్ భాగాల చుట్టూ మంటగా ఉంటుంది. ఈ సమస్య కొన్ని వారాల పాటు కొనసాగుతోంది. రక్తం గడ్డకట్టడం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వైద్యుల ప్రకారం మహిళలు చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలి. ఎందుకంటే దీని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. గర్భాశయాన్ని తొలగించడం చివరి ఎంపిక మాత్రమే కావాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News