High BP Patients: హై బీపీ ఉన్న వారికి అలర్ట్.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
High BP Patients: వేసవి కాలంలో మండుతున్న ఎండలకు శరీరానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఎవరికైతే హై బీపీ సమస్య ఉందో వాళ్ళు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
High BP Patients: హై బీపీ ఉన్న వారికి అలర్ట్.. వేసవిలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
High BP Patients: వేసవి కాలంలో మండుతున్న ఎండలకు శరీరానికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. కానీ, ఎవరికైతే హై బీపీ సమస్య ఉందో వాళ్ళు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎండ తీవ్రత, ఉక్కపోత, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం హై బీపీ రోగులకు చాలా ప్రమాదకరంగా మారవచ్చు. కొన్నిసార్లు ఎక్కువ వేడి వల్ల ఇలాంటి రోగులు స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది. వేసవిలో హై బీపీ ఉన్నవారు తమ లైఫ్ స్టైల్, ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే వాళ్ల ఆరోగ్యం బాగా ఉంటుంది. వేసవిలో హై బీపీ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
వేసవిలో శరీరం నుండి చెమట రూపంలో చాలా నీరు బయటకు పోతుంది. హై బీపీ రోగులకు శరీరంలో డిహైడ్రేషన్ చాలా ప్రమాదకరం. నీరు తక్కువైతే రక్తపోటు అదుపు తప్పిపోవచ్చు. కాబట్టి జుకు 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పకుండా తాగాలి. బ్బరి నీళ్లు, షర్బత్ వంటి సహజ పానీయాలు చాలా మంచివి. కోల్డ్ డ్రింక్స్ లేదా సోడా వంటివి తాగడం మానేయండి. ఎందుకంటే వాటిలో చక్కెర, రసాయనాలు ఎక్కువగా ఉంటాయి.
హై బీపీ రోగులు వేసవిలో ఉప్పును మరింత తక్కువగా తీసుకోవాలని చెప్పారు. ఎక్కువ ఉప్పు తింటే శరీరం నీటిని నిలుపుకుంటుంది. దీనివల్ల రక్తపోటు పెరగొచ్చు. వంటల్లో మామూలు ఉప్పు బదులు రాక్ సాల్ట్ వాడొచ్చు. బయట దొరికే వేయించిన ఆహారాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. వేసవిలో నూనె ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అరిగించుకోవడం కష్టం. కాబట్టి, హై బీపీ ఉన్నవారు తేలికైన, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తినాలి.సలాడ్లు, ఆకుకూరలు, పప్పులు, పెరుగు వంటివి ఆహారంలో చేర్చుకోండి.
మాంసాహారం తినేవారు వేసవిలో మాంసం-చేపలు తక్కువగా తినాలి. ఎందుకంటే అవి శరీరంలో వేడిని పెంచుతాయి. పుచ్చకాయ , దోసకాయ, కీరా, బొప్పాయి వంటి పండ్లు శరీరానికి చలువ చేస్తాయి, బీపీని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. వేసవిలో ఎక్కువ సేపు ఎండలో ఉంటే శరీరం ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగొచ్చు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు బయటకు వెళ్లడం మానుకోండి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు పెట్టుకోండి.