Health Tips: హై బీపీ పేషెంట్లకి అలర్ట్‌.. గుండెపోటుకి ముందు ఈ 5 సంకేతాలు..!

Health Tips: ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా చాలామంది బీపీ పేషెంట్లుగా మారుతున్నారు. ఆఫీసులో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల కారణంగా బీపీ వచ్చేస్తుంది.

Update: 2023-09-12 16:00 GMT

Health Tips: హై బీపీ పేషెంట్లకి అలర్ట్‌.. గుండెపోటుకి ముందు ఈ 5 సంకేతాలు..!

Health Tips: ఈ రోజుల్లో చెడు జీవనశైలి కారణంగా చాలామంది బీపీ పేషెంట్లుగా మారుతున్నారు. ఆఫీసులో పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతల కారణంగా బీపీ వచ్చేస్తుంది. ఒక నివేదిక ప్రకారం ప్రతి ఐదుగురు వ్యక్తులలో ఒకరు హైబీపీ లేదా లో బీపీతో బాధపడుతున్నారు. అయితే ఇందులో హై బీపీ చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో గుండెపోటుగా మారుతుంది. వైద్యుల ప్రకారం గుండె పనితీరులో తేడా వస్తే కొన్ని రకాల సంకేతాలని అందిస్తుంది. వాటిని అస్సలు విస్మరించకూడదు. గుండెపోటుకు ముందు శరీర సంకేతాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మైకము

రక్తపోటు పెరిగినప్పుడు హైబీపీ రోగుల్లో తల తిరిగినట్లవుతుంది. కొన్నిసార్లు ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కానీ ప్రతిసారి తలనొప్పిని రక్తపోటుతో ముడిపెట్టవద్దు. మీకు తేడా అనిపించినప్పుడు డాక్టర్‌ని సంప్రదిస్తే సరిపోతుంది.

చెమటలు పట్టడం

సాధారణ సమయంలో అకస్మాత్తుగా చెమటలు పడితే ప్రమాదకరమైన సంకేతం. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇది శరీరంలో పెరిగిన రక్తపోటుకు సంకేతం అవుతుంది. మరొకటి ఇది గుండెపోటు ప్రారంభ లక్షణం అవుతుంది. కాబట్టి హైబీపీ ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి.

హృదయ స్పందన రేటు

హృదయ స్పందన అకస్మాత్తుగా పెరిగినట్లయితే నిర్లక్ష్యం చేయవద్దు. ఇది హై బీపీకి సంకేతం అవుతుంది. చాలా సార్లు పరుగెత్తడం, అధిక పని, భయం కారణంగా గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఉన్నట్లుగా గుండె వేగం పెరిగిందంటే గుండెపోటు వచ్చే అవకాశాలు ఉంటాయని గుర్తించండి. అనుమానం ఉంటే డాక్టర్‌ని సంప్రదించాలి.

శ్వాస ఆడకపోవడం

రక్తపోటు ఉన్న రోగులలో శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. కానీ ఈ లక్షణాన్ని హైబీపీకి సంకేతంగా మాత్రమే చూడకూడదు. దీనివల్ల గుండెపోటు సంభవించే అవకాశాలు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి టెస్ట్‌ చేయించుకోవాలి.

Tags:    

Similar News