Water: రాత్రి పూట అధికంగా నీళ్లు తాగుతున్నారా..!

Water: రాత్రి పూట అధికంగా నీళ్లు తాగుతున్నారా..!

Update: 2022-04-14 14:30 GMT

Water: రాత్రి పూట అధికంగా నీళ్లు తాగుతున్నారా..!

Water: నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎక్కువ తక్కువ తాగితే అది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట నీరు త్రాగటం ప్రయోజనకరమా లేదా హానికరమా అనేది తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. రాత్రిపూట నీరు తాగితే జీవక్రియ సులువుగా జరుగుతుంది. టాక్సిన్స్, వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లడానికి ఎటువంటి సమస్య ఉండదు. రాత్రిపూట సాధారణ నీటిని తాగడానికి బదులుగా గ్రీన్ టీ, హెర్బల్ టీ, నిమ్మరసం ద్వారా నీటిని తాగితే మరింత ప్రయోజనం పొందుతారు.

రాత్రి భోజనం చేసిన తర్వాత నీరు తాగితే శరీరం సహజంగా క్లీన్ అవుతుంది. విష పదార్థాలను బయటకు పంపి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎసిడిటీ, గ్యాస్‌ సమస్య ఉన్నవారు రాత్రిపూట నీళ్లు తాగాలి. జలుబు రోగులకు రాత్రిపూట నీరు ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహం, గుండెపోటు ఉన్నవారు రాత్రిపూట ఎక్కువ నీరు తాగడం మానుకోవాలి. అలాంటివారు రాత్రిపూట ఎక్కువ నీరు తాగితే పదే పదే టాయిలెట్‌కు వెళ్లవలసి ఉంటుంది. దీని కారణంగా వారి నిద్ర చెదిరిపోతుంది.

కొంత మంది భోజనం తినేటప్పుడు తప్పనిసరిగా వాటర్ తాగుతుంటారు. పక్కన గ్లాసులో నీళ్లు లేనిదే ముద్ద దిగదు. కానీ అన్నం తినేటప్పుడు నీళ్లు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థలో కొద్దిపాటి అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి భోజనం ముగించిన అరగంట వరకూ మంచినీళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇలా చేయడం వల్ల అవసరమైన పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. అందుకే నీటిని తాగేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి.

Tags:    

Similar News