Health Tips: చలికాలం బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే.. అవేంటంటే..?

* చలికాలంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

Update: 2022-12-25 14:00 GMT

Health Tips: చలికాలం బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే.. అవేంటంటే..?

Health Tips: ప్రతి ఒక్కరూ బరువు తగ్గాలని కోరుకుంటారు. నాజూకైన నడుము, అందమైన ఫిగర్ ఉండాలని అనుకుంటారు. కానీ సరైన డైట్‌ పాటించరు. బరువు తగ్గించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ బాగా ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో బరువు తగ్గాలంటే డైట్ మార్చుకోవడం తప్పనిసరి. చలికాలంలో కొన్ని ఆరోగ్యకరమైన వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

వాల్నట్

వాల్ నట్స్ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఫైబర్స్ పుష్కలంగా లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.

మఖానా

మఖానాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో మఖానా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. మఖానా తినడం వల్ల ఎంతో శక్తి లభిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

జామ

బరువు తగ్గించడంలో జామ ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. జామపండులో విటమిన్ సి, ఫైబర్ పెద్ద మొత్తంలో లభిస్తాయి. చలికాలంలో జామ పుష్కలంగా లభిస్తుంది. జామపండును అల్పాహారంగా చేర్చుకోవడం వల్ల బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

బత్తాయి

బత్తాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. బత్తాయి తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఫైబర్ జీవక్రియను పెంచడానికి పనిచేస్తుంది. బత్తాయి బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యారెట్‌

క్యారెట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో క్యారెట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్యారెట్‌లో ఫైబర్ పెద్ద మొత్తంలో ఉంటుంది. క్యారెట్‌లో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇది పొట్టను త్వరగా నింపుతుంది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Tags:    

Similar News