Acidity: అసిడిటీ ఉన్న వాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే..
Acidity: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అసిడిటీ సమస్య బారిన పడుతున్నారు.
Acidity: అసిడిటీ ఉన్న వాళ్లు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే..
Acidity: మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల చాలా మంది అసిడిటీ సమస్య బారిన పడుతున్నారు. అయితే అసిడిటీ ఒక్కసారి వచ్చిందంటే అంత సులభంగా తగ్గదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ అసిడిటీ సమస్య ఉన్న వారు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అసిడిటీ సమస్య ఉన్న వారు సిట్రస్ పండ్లు (నారింజ, నిమ్మకాయ, ద్రాక్షపండ్లు), టమాటాలు, కారంగా ఉన్న ఆహారాలు, అధిక కొవ్వు లేదా జిడ్డు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే చాక్లెట్, కార్బోనేటెడ్ పానీయాలు, కాఫీ, ఆల్కహాల్ వంటి వాటిని వీలైనంత వరకు తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా రాత్రి పడుకునే ముందు అధికంగా తినడం వల్ల కూడా అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.
అలాగే నూనెలో ఎక్కువగా వేయించిన ఆహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే ఆమ్లత్వం ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను, టమాటలను తీసుకోకూడదని నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్స్‌ను తీసుకున్నా కడుపులో గ్యాస్, వాపు, ఒత్తిడిని పెంచి అసిడిటీ లక్షణాలను తీవ్రతరం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యాసిడిటికి చెక్ పెట్టే చిట్కాలు..
ఇంగువ కలిపిన నీటిని తీసుకుంటే పుల్లని తేన్పులు, కడుపునొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గోరు వెచ్చని నీటిలో చిటెకెడు ఇంగువా కలిపి తీసుకుంటే సరిపోతుంది. ఇక సోంపు కూడా అసిడిటీని దూరం చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్, అసిడిటీ, పుల్లని తేన్పులు సమస్యను తగ్గిస్తాయి. పుదీనా ఆకులను నమిలినా ఉపశమనం లభిస్తుంది. జీలకర్ర జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది, పుల్లని తేన్పులను, గ్యాస్, అసిడిటీని తగ్గిస్తుంది. అల్లం ముక్కలు కూడా అసిడిటీ సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అల్లంలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.