Cancer : క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది.. రష్యా సైంటిస్టుల సంచలన ఆవిష్కరణ
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది ఒక్కసారి మొదలైతే క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. వాటిలో కోలన్ లేదా ప్రేగు క్యాన్సర్ చాలా సాధారణం. అయితే, ఈ ప్రమాదకరమైన వ్యాధికి రష్యా శాస్త్రవేత్తలు ఒక వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.
Cancer : క్యాన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది.. రష్యా సైంటిస్టుల సంచలన ఆవిష్కరణ
Cancer : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది ఒక్కసారి మొదలైతే క్రమంగా శరీరాన్ని నాశనం చేస్తుంది. వాటిలో కోలన్ లేదా ప్రేగు క్యాన్సర్ చాలా సాధారణం. అయితే, ఈ ప్రమాదకరమైన వ్యాధికి రష్యా శాస్త్రవేత్తలు ఒక వ్యాక్సిన్‌ను కనుగొన్నారు. అన్ని ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు ఇది మానవుల మీద ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. రష్యాలో తయారైన ఈ ప్రయోగాత్మక వ్యాక్సిన్ పేరు ఎంటెరోమిక్స్ (EnteroMix). ఒకవేళ ఈ వ్యాక్సిన్ నిజంగానే ప్రభావవంతంగా నిరూపితమైతే, క్యాన్సర్ చికిత్సలో ఇది ఒక గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది?
ప్రస్తుతం క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు కెమోథెరపీ లేదా రేడియేషన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇది చాలా ఖరీదైనది. రోగికి కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందని చెప్పడం చాలా కష్టం.
కానీ, రష్యా శాస్త్రవేత్తలు కనుగొన్న ఎంటెరోమిక్స్ వ్యాక్సిన్ వేరే విధంగా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ ప్రమాదకరం కాని నాలుగు వైరస్‌ల కలయికతో రూపొందించబడింది. ఈ వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అంతేకాకుండా, క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ఈ వైరస్‌లు బలోపేతం చేస్తాయి.
మానవుల మీద ప్రయోగాలు మొదలు
గత కొన్ని సంవత్సరాలుగా రష్యా శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ అన్ని ప్రీక్లినికల్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. ఇప్పుడు మానవులపై ప్రయోగాలు ప్రారంభ దశలో ఉన్నాయి. మానవులపై ఇది పూర్తిగా ప్రభావవంతంగా ఉంటుందని నిరూపితమైతే, క్యాన్సర్‌పై మానవుల పోరాటానికి కొత్త ఉత్సాహం లభించినట్లే.