కేబినెట్ పై జగన్ కసరత్తు...మంత్రివర్గంలో...

Update: 2019-05-25 08:41 GMT

జగన్ కేబినెట్ పై కసరత్తు కొనసాగుతోంది. జ‌గ‌న్ త‌న మంత్రి వ‌ర్గంలో ఎవ‌రికి ఆవ‌కాశం ఇస్తారు సీనియ‌ర్ల‌కి ప్రాదాన్యం ఇస్తారా యువ నేత‌ల‌కు పెద్ద‌పీట వేస్తారా జిల్లాలు, సామాజిక వ‌ర్గాల వారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు. ఏపీ మంత్రివర్గంపై కసరత్తు మొదలవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యే ఉత్కంఠ మొదలైంది. ముఖ్యంగా పార్టీలోని సీనియర్ నేతలు, తమకు కేబినెట్ లో బెర్త ఖాయమని ధీమాగా ఉన్నారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలతో పాటు ఇటీవల కాలంలో పార్టీలో చేరిన వారికి కూడా కేబినెట్ లో చోటు దక్కనుందని తెలుస్తోంది. జిల్లాల వారిగా, సామాజిక వర్గాల ఇప్పటికే లిస్ట్ సిద్ధమవుతుండటంతో ఆశావాహుల్లో టెన్షన్ మొదలైంది. ఎన్నికల ప్రచార సమయంలోనే జగన్ పలువురికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇవ్వడంతో తమకు కేబినెట్ లో బెర్త్ లాంఛనమేనని కొందరు నేతలు ధీమాగా ఉన్నారు.

  Full View

Similar News