Solar Storms: సూర్యుడి నుంచి రెండు శక్తిమంతమైన సౌర‌తుఫాన్లు

Solar Storms: మే 2,3 తేదీల్లో సౌర తుఫాన్లు వచ్చాయన్న శాస్త్రవేత్తలు

Update: 2024-05-06 11:52 GMT

Solar Storms: సూర్యుడి నుంచి రెండు శక్తిమంతమైన సౌర‌తుఫాన్లు 

Solar Storms: సూర్య గోళం భీక‌రంగా మండుతోంది. కొన్ని రోజుల నుంచి సౌర తుఫాన్లు రిలీజ్ అయ్యాయి. భూమిపై సాధార‌ణ జ‌న‌జీవ‌నాన్ని స్తంభింప‌చేసే రీతిలో సౌర తుఫాన్లు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మే 2వ తేదీన తొలిసారి సోలార్ స్టార్మ్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. దీన్ని ఎక్స్‌-క్లాస్ కేట‌గిరీ తుఫాన్‌గా భావిస్తున్నారు. సౌర తుఫాన్‌లలో ఇది అత్యంత శ‌క్తివంత‌మైందంటున్నారు. సూర్యుడిలోని AR3663 ప్రాంతంలో భారీ స్థాయిలో తుఫాన్ లేచిన‌ట్లు సౌర‌ శాస్త్రవేత్త కీత్ స్ట్రాంగ్ తెలిపారు. మే 3న రెండోసారి సైతం సౌర తుఫాన్లు వ‌చ్చాయి. దాన్ని ఎం-క్లాస్ తుఫాన్‌గా అంచ‌నా వేశారు.

Tags:    

Similar News