తక్కువ ధరలో లభిస్తున్న జనరిక్ మందులు..

Update: 2019-04-28 09:17 GMT

మనదేశంలో ప్రతి ఏటా వేల కోట్ల మెడికల్ బిజినెస్ జరుగుతోంది. రూపాయి డ్రగ్‌ని పది రూపాయలుకు విక్రయిస్తున్నా ప్రశ్నించలేని పరిస్ధితి. మెడికల్ మాఫియా ఆటకట్టించడానికి జనరిక్ మెడిసన్ వచ్చినా సరైన ఆదరణలేదు. జనరిక్ వచ్చి 20 ఏళ్లు అవుతున్నా 20% మంది ప్రజలు కూడా జనరిక్ మెడికల్ షాపులకి వెళ్లడం లేదంటే జనరిక్ మెడిసన్ పట్ల ప్రజలకి అవహగానలోపం ఎంతలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

జనరిక్ మందులు బ్రాండెడ్ మందులు పేరు మాత్రమే వేరు తయారీ ఒకటే ఫార్ములా ఒకటే. కానీ సరైన ప్రచారం లేక జనరిక్ మెడిసన్ అంటే భయపడే పరిస్థితి నెలకొంది. జనరిక్ మందులు తక్కువ ధరకు లభిస్తున్నాయి కాబట్టి అవి సరిగా పని చేస్తాయో చేయవో అని ప్రజలు భయపడుతున్నారు. జనరిక్ పైన డాక్టర్ల కూడా శ్రద్ద చూపడంలేదనే వాదన ఉంది..అయితే కొందరు డాక్టర్లు మాత్రం జనరిక్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. రెండు మూడు రోజుల్లో వాడే మందులు బ్రాండెడ్ కొన్నా పర్లేదు కాని నెలల తరబడి మందులు వాడే వారు మాత్రం జనరిక్ కొనడమే ఉత్తమం అంటున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మందులకి అయ్యే ఖర్చు నెలకి వేయికి పైనే ఉంటుంది..జనరిక్ మందులపై దృష్టి పెడితే మందుల కోసం చేసే ఖర్చు చాలా వరకు తగ్గనుంది. 

Full View

Similar News