మండిపోతున్న కూరగాయల ధరలు

ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు కూరగాయల తోటలు పాడవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ రేటు చూసినా కిలో

Update: 2019-11-24 16:48 GMT
Vegetables

కోయకుండానే ఉల్లిధర కన్నీరు పెట్టిస్తుండగా పచ్చిమిర్చి మంటెక్కిస్తోంది. కాకరకాయ ధర మింగుడు పడనంటోంది. టమాటా కొనాలంటే ఠారెత్తిస్తోంది. రైతు బజారు నుంచి గలీ దుకాణాల్లో సైతం ధరలు మండిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. సామాన్య ప్రజలు మార్కెట్‌కు వెళ్లాలంటే వణికిపోతున్నారు.

ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకు కూరగాయల తోటలు పాడవడంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయ రేటు చూసినా కిలో 40 రూపాయలకి పైగానే ఉంది. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కూరగాయలు కొనేందుకు జంకుతున్నారు. వ్యాపారులు చెప్పే ధరలకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు కిందకు మీదకు చూడాల్సి వస్తుంది. కూరగాయలు లేకుండా పూట గడవని పరిస్థితిలో వాటి ధరలు ఆకాశాన్నంటడంతో.. కిలో కొనాలనుకున్న వారు అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు.

విశాఖ జిల్లాలో రోజు రోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వర్షాకాలం పోయి చలికాలం వచ్చింది. ఇప్పుడైనా కూరగాయల ధరలు తగ్గుతాయనుకుంటే కార్తీక మాసం ప్రభావం అంటున్నారు. నోములు, వ్రతాలు, పూజలతో నాన్‌వెజ్‌ తిననివారు వెజిటేరియన్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ధరలు ఎక్కువగా ఉన్నాయని వాపోతున్నారు వినియోగదారులు. రైతు బజార్ల కన్నా... బయట మార్కెట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉందంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా దిగుబడి తగ్గిందని... పరిస్థితి ఇంకా పూర్తిస్థాయిలో మెరుగుపడలేదని అమ్మకందారులు అంటున్నారు. సప్లై తక్కువ... డిమాండ్‌ ఎక్కువ ఉండటంతో రేట్లు పెరిగాయంటున్నారు.

Full View

Tags:    

Similar News