ప్రత్తిపాటి పుల్లారావుకు ఆమె చేతిలో ఓటమి తప్పదా?

Update: 2019-05-03 03:46 GMT

రాజకీయ రంగం ఇదో చదరంగం. ఈ రంగంలో గురువును మించిన శిశ్యులు ఉంటారు. గురువులకే షాక్‌కి ఇచ్చే గురిచేయడమన్నది కొత్తేమీ కాదు. ఇటివల ముగిసిన ఏపీ సార్వత్రిక పోరులో ఇలాంటి గురుశిష్యుల పోటీ ఒకటుంది. ఈ ఎన్నికల పోరులో గురువుపై భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేస్తుందన్న మాట జోరుగా వినిపిస్తోంది. అయితే ఇంతకి ఎవరా గురుశిశ్యులు ఎవరనుకుంటున్నరా? ఇక గురువు విషయానికి వోస్తే టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఇక శిష్యురాలు విషయానికి వోస్తో వైసీపీ నేత విడదల రజినీ. వీరిద్దరూ ఈ2019 ఎన్నికలకు ముందు గురుశిష్యులే. ఎన్నికలకు ముందు వరకు విడదల రజినీ పుల్లారావుకు అనుచరురాలిగానే ఉండేవారు. పుల్లారావు దగ్గరే రాజకీయాలు నేర్చుకున్న రజినీ ఆ తరువాత మొళ్లిగా వైసీపీ గూటికి చేరింది. ఆ క్రమంలోనే వైసీపీ నుండి టిక్కెట్ కూడా సంపాదించారు. ఇక ఏకంగా గురువుపైనే అంటే ప్రత్తిపాటి పుల్లారావుపైనే ఎన్నికల్లో పోటీకి దిగారు.

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకు గత ఎన్నికల వరకు తిరుగేలేదు అయితే ఇప్పుడు సీన్ మారిందనే స్వరం జోరుగా వినిపిస్తోంది. ఈసారి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి అంచుల్లో ఉన్నరని ఓటమి మాత్రం ఖాయమనే టాక్ జోరుగా వినిపిస్తోంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ప్రత్తిపాటి పుల్లారావు 1999లో భారీ మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. అయితే గత 2004లో మాత్రం ఓటమి రూచిచూశారు. ఇక ఆ ఓటమి తరువాత పుల్లారావు రాజకీయంగా బలపడ్డారు. దాంతో 2009 - 2014లో కూడా మంచి విజయాలు సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం గెలుపు అంచుల్లో కూడా వెల్లలేరని అంటున్నారు. దీనిగల ప్రధాన కారణం వైసీపీ అభ్యర్థి విడదల రజినీ ప్రచారంలో దూసుకుపోవడమే. ఎన్నికలకు కొద్దినెలల ముందు వరకు కూడా విడదల రజినీ పుల్లారావుతోనే ఉన్నారు. ఎప్పుడైతే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర గుంటూరుకు వచ్చేసరికి సీను మారిపోయింది. జగన్ పాదయాత్రతో రజినీ వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఆ తరువాత చిలకలూరిపేట టిక్కెట్ సంపాదించుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో రజినీ మాత్రం పుల్లారావు ఆయన భార్య చేసిన ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్తూదీంతో రజినీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని వినిపిస్తోంది. 

Similar News