ఎర్ర చొక్కా వేసుకొచ్చాడని విప్పించి ఓటేయించారు..

Update: 2019-05-06 12:25 GMT

ఎన్నికల్లో అప్పుడప్పుడు కొన్ని తమాషాలు జరుగుతూ ఉంటాయి.. ఇప్పుడు అలాంటి తమాషానే ఒకటి జరిగింది.. ప్రస్తుతం జరుగుతున్న ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు ఓ ఓటర్ ఎర్ర చొక్కా వేసుకొని వచ్చాడు.. ఇందులో పోలీసులు కొంచం అత్యుత్సాహం ప్రదర్శించారనే చెప్పాలి.. అతని చేత చొక్కా విప్పించి లైన్ లో నిలబెట్టారు.. దీనిలో ఓటరు భార్య జోక్యం చేసుకోవడంతో పోలీసులకు మరియు ఓటరుకి మధ్య మాటల యుద్ధం నడిచింది.. గొడవ కొంచం పెద్దదిగా కావడంతో ఎన్నికల అధికారులు గ్రామస్థులు నచ్చజెప్పి ఓటేయించారు.. ఈ ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది...  

Similar News