Nirbhaya Case: ఈరోజు విజయం సాధించాం: నిర్భయ తండ్రి

నిర్భయ దోషులను శుక్రవారం తెల్లవారుజామున జిల్లా మేజిస్ర్టేట్‌, అధికారుల సమక్షంలో ఉరి సంగతి తెలిసిందే. దీంతో నిర్భయ కుటుంబం తోపాటు యావత్ ప్రజానీకం ఈ చర్యను హర్షించింది.

Update: 2020-03-20 03:31 GMT
Nirbhaya father

నిర్భయ దోషులను శుక్రవారం తెల్లవారుజామున జిల్లా మేజిస్ర్టేట్‌, అధికారుల సమక్షంలో ఉరి సంగతి తెలిసిందే. దీంతో నిర్భయ కుటుంబం తోపాటు యావత్ ప్రజానీకం ఈ చర్యను హర్షించింది. ఆనందంతో చాలా చోట్ల స్వీట్లు పంచి పెట్టుకున్నారు. నిర్భయ తండ్రి బద్రినాథ్‌ సింగ్‌ దోషులకు ఉరిశిక్ష అమలు అనంతరం స్పందించారు.. ఈ మేరకు ప్రముఖ మీడియాతో మాట్లాడారు.. అందులో

'ఈరోజు మేం విజయం సాధించాం.. సమాజం, మీడియా, ఢిల్లీ పోలీసుల వల్లే ఇది సాధ్యమైంది.. నేను ఎంత సంతోషంతో ఉన్నాననేది నా నవ్వు మీకు చెబుతుంది' అని విజయ చిహ్నం చూపుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక అంతకుముందు శుక్రవారం నిర్భయ దోషులను ఉరితీయటంపై నిర్భయ తల్లి ఆశాదేవి కూడా సంతోషం వ్యక్తం చేశారు.. ఇన్నాళ్లకు తన కుమార్తెకు న్యాయం జరిగిందని.. ఇప్పుడు తన కుమార్తె ఆత్మకు శాంతి కలిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారామె. ఇదిలావుంటే నలుగురు మృతదేహాలను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ బిఎన్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్యుల బృందం మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహిస్తోంది.



Tags:    

Similar News