Mega Job Mela in Kurnool: టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి ప్రైవేట్ ఉద్యోగాల్లో అవకాశాలు!

జూన్ 18న కర్నూలు జిల్లా పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో 16 ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

Update: 2025-06-16 10:09 GMT

Mega Job Mela in Kurnool: టెన్త్, ఇంటర్, డిగ్రీ చదివిన వారికి ప్రైవేట్ ఉద్యోగాల్లో అవకాశాలు!

Mega Job Mela in Kurnool: కర్నూలు జిల్లా నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. జూన్ 18న పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ ఉద్యోగ మేళాలో 16 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి.

ప్రత్యేకత ఏంటంటే, పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు పరీక్షలు లేకుండానే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ఈ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జిల్లాల వారీగా ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

జిల్లా ఉపాధి కల్పన అధికారి పి. సోమశివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ జాబ్ మేళా ద్వారా అనేక మంది యువతకు కార్పొరేట్, మల్టీనేషనల్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది.

ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News