2026 KTM 790 Duke: కుర్రాళ్ల డ్రీమ్ మెషీన్ ఈజ్ బ్యాక్.. కొత్త అవతారంలో 2026 KTM 790 డ్యూక్..!

2026 KTM 790 Duke: బైక్ లవర్స్‌కి పూనకాలు తెప్పించే వార్త ఇది. మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకెడ్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న KTM 790 డ్యూక్, ఇప్పుడు సరికొత్త మేకోవర్‌తో రాబోతోంది.

Update: 2026-02-10 12:29 GMT

2026 KTM 790 Duke: కుర్రాళ్ల డ్రీమ్ మెషీన్ ఈజ్ బ్యాక్.. కొత్త అవతారంలో 2026 KTM 790 డ్యూక్..!

2026 KTM 790 Duke: బైక్ లవర్స్‌కి పూనకాలు తెప్పించే వార్త ఇది. మిడిల్‌వెయిట్ స్ట్రీట్ నేకెడ్ సెగ్మెంట్‌లో రారాజుగా వెలుగొందుతున్న KTM 790 డ్యూక్, ఇప్పుడు సరికొత్త మేకోవర్‌తో రాబోతోంది. ముఖ్యంగా దీని హెడ్‌లైట్ స్టైల్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తన అన్నలు 990 డ్యూక్, 1390 సూపర్ డ్యూక్ R నుంచి ఇన్‌స్పిరేషన్ పొంది, సెంటర్‌లో పవర్‌ఫుల్ LED హెడ్‌లైట్, రెండు పక్కల అగ్రెసివ్ DRLs‌తో ఈ బైక్ సిద్ధమైంది. ఈ కొత్త లుక్ బైక్‌కు ఒక కిల్లర్ అప్పీరెన్స్‌ను ఇస్తోంది.

డిజైన్ మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా 2026 మోడల్ అదరగొడుతోంది. కొత్తగా డిజైన్ చేసిన ఫ్యూయల్ ట్యాంక్ , ష్రౌడ్స్ బైక్‌ను మరింత మజిల్డ్‌గా చూపిస్తున్నాయి. అలాగే కొత్త సబ్ ఫ్రేమ్, రీడిజైన్ చేసిన ఎగ్జాస్ట్ సిస్టమ్ దీనికి మరింత స్పోర్టీ టచ్ ఇచ్చాయి. యూత్ టేస్ట్‌కు తగ్గట్టుగా అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో ఈ బైక్‌ను కేటీఎం మలుస్తోంది. పాత తరం మోడల్స్ కంటే ఇది చాలా షార్ప్‌గా, బోల్డ్‌గా కనిపిస్తోంది.

మెకానికల్ విషయానికి వస్తే, నమ్మకమైన 799cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్నే ఇందులో కొనసాగిస్తున్నారు. ఇది సుమారు 95hp పవర్, 87Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంటే రోడ్డు మీద ఎక్సలరేటర్ ఇస్తే ఈ బైక్ రాకెట్‌లా దూసుకుపోవడం ఖాయం. స్ట్రీట్ రేసింగ్ ఇష్టపడే వారికి ఈ పవర్ అన్-లిమిటెడ్ కిక్కును ఇస్తుంది. ఇంజిన్ స్మూత్‌నెస్‌తో పాటు పికప్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా కేటీఎం జాగ్రత్తలు తీసుకుంది.

కేవలం స్పీడ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ అని కేటీఎం మరోసారి ప్రూవ్ చేసింది. ఈ కొత్త మోడల్‌లో మునుపటి J.Juan బ్రేక్ కాలిపర్స్ స్థానంలో హై-క్వాలిటీ WP బ్రేక్ కాలిపర్స్‌ను అమర్చారు. దీనివల్ల బ్రేకింగ్ పవర్ మరింత పక్కాగా ఉంటుంది. ఇప్పటికే మార్కెట్లో పాపులర్ అయిన WP సస్పెన్షన్, స్ట్రాంగ్ స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ ఈ మోడల్‌లోనూ కొనసాగుతున్నాయి. రైడింగ్ చేసేటప్పుడు మంచి గ్రిప్, కంట్రోల్‌ను ఇవి అందిస్తాయి.

ప్రస్తుతానికి ఈ వివరాలు చైనాలో ఫైల్ చేసిన డాక్యుమెంట్ల ద్వారా బయటకు వచ్చాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ 2026 మోడల్ భారీ అంచనాలతో లాంచ్ కానుంది. అయితే ఇండియన్ బైక్ రైడర్స్ అందరి కళ్ళు ఇప్పుడు ఈ బైక్ భారత్‌కు ఎప్పుడు వస్తుందనే దానిపైనే ఉన్నాయి. ఒకవేళ కేటీఎం ఈ వెర్షన్‌ను ఇండియాలో ప్రవేశపెడితే, ఇక్కడి కుర్రాళ్ల క్రేజ్ మామూలుగా ఉండదు. కంపెనీ నుంచి దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది

Tags:    

Similar News