Oppo Find N6: ఒప్పో ఫైండ్ N6.. టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించడానికి రెడీ..!
Oppo Find N6: వచ్చేస్తోంది ఒప్పో నెక్స్ట్ లెవల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఒప్పో ఫైండ్ N6' పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ మొబైల్, టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది.
Oppo Find N6: ఒప్పో ఫైండ్ N6.. టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించడానికి రెడీ..!
Oppo Find N6: వచ్చేస్తోంది ఒప్పో నెక్స్ట్ లెవల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఒప్పో ఫైండ్ N6' పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్న ఈ మొబైల్, టెక్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో ఏకంగా 200MP కెమెరాను అమర్చబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లలో ఇంత భారీ కెమెరా సెన్సార్ రావడం ఇదే మొదటిసారి కావచ్చు. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ యూత్ అండ్ టెక్ గీక్స్‌ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో 8.12 అంగుళాల భారీ 2K ఫోల్డబుల్ స్క్రీన్‌ను అందిస్తున్నారు. LTPO టెక్నాలజీతో వస్తున్న ఈ స్క్రీన్, విజువల్స్ పరంగా రిచ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. గేమింగ్ ఆడినా లేదా హై-క్వాలిటీ వీడియోలు చూసినా రిఫ్రెష్ రేట్ స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోన్ బయట వైపు 6.62 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉంటుంది, కాబట్టి ఫోన్ ఓపెన్ చేయకుండానే చాలా పనులు చక్కబెట్టేయొచ్చు. మునుపటి మోడల్స్ కంటే ఇది చాలా సన్నగా, తేలికగా ఉంటుందని సమాచారం.
కెమెరా అంటే కేవలం మెగాపిక్సెల్స్ మాత్రమే కాదు, క్వాలిటీ కూడా ముఖ్యం. ఒప్పో ఫైండ్ N6లో 200MP మెయిన్ కెమెరాతో పాటు రెండు 50MP సెన్సార్లు కూడా ఉండబోతున్నాయి. అంటే సెల్ఫీలు, ల్యాండ్‌స్కేప్ షాట్స్, నైట్ ఫోటోగ్రఫీ.. ఏది తీసినా క్లారిటీ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారికి, ఫోటోలు అంటే ప్రాణం ఇచ్చే వారికి ఈ ఫోన్ ఒక డ్రీమ్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. కలర్ అక్యూరసీ కోసం ప్రత్యేకమైన మల్టీస్పెక్ట్రల్ సెన్సార్‌ను కూడా జత చేస్తున్నారట.
స్పీడ్ విషయంలో ఈ ఫోన్ తగ్గేదే లే అంటోంది. లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో ఇది రన్ అవుతుంది. అంటే హెవీ గేమింగ్ లేదా మల్టీటాస్కింగ్ చేసినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఇక 6000mAh భారీ బ్యాటరీ ఉండటం వల్ల ఛార్జింగ్ టెన్షన్ ఉండదు. 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో, నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. స్టోరేజ్ పరంగా 16GB RAM, 1TB వరకు మెమరీ ఆప్షన్లు ఉండొచ్చు.
ప్రస్తుతం ఉన్న రూమర్ల ప్రకారం, ఈ ఒప్పో ఫైండ్ N6 మార్చి 17న చైనాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్‌లోకి రానుంది. ఇండియాలో కూడా దీని కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాటిలైట్ కమ్యూనికేషన్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రీమియం ఫీచర్లతో రాబోతున్న ఈ ఫోన్, శాంసంగ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. టైటానియం, గోల్డెన్ ఆరెంజ్ వంటి ట్రెండీ కలర్స్ లో ఇది కంటికి కుదురుగా కనిపించబోతోంది.