తెలంగాణలో భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య

Update: 2019-04-11 01:59 GMT

తెలంగాణలో గతంలో కంటే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014తో పోలిస్తే సుమారు 14లక్షల మంది ఓటర్లు పెరిగారు. మరోవైపు కొత్త ఓటర్లు తగ్గినప్పటికీ 31లక్షల మంది ఓటర్లతో మల్కాజ్‌గిరే అగ్రస్థానంలో ఉంది. 14లక్షల మంది అత్యల్ప ఓటర్లతో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులున్న నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఏర్పాట్లుచేసింది. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.

తెలంగాణలో మొత్తం 2కోట్ల 95లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 2014తో పోలిస్తే సుమారు 14లక్షల మంది ఓటర్లు పెరిగారు. మల్కాజ్‌గిరి మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. కొత్త ఓటర్లు తగ్గినప్పటికీ 31లక్షల మంది ఓటర్లతో మల్కాజ్‌గిరే అగ్రస్థానంలో ఉంది. ఇక 14లక్షల మంది అత్యల్ప ఓటర్లతో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం చివరి స్థానంలో నిలిచింది.

హైదరాబాద్‌ జిల్లాలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ లోక్‌సభ స్థానాలున్నాయి. 19.68 లక్షల మంది ఓటర్లు ఉన్న సికింద్రాబాద్‌లో 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 19.57 లక్షల మంది ఓటర్లు ఉన్న హైదరాబాద్‌లో 15 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలో 50 శాతానికి కొంచెం అటు, ఇటుగా పోలింగ్‌ నమోదయ్యే అవకాశం ఉంది. 

Similar News