కదులుతున్న ఇల్లు

Update: 2019-06-04 09:31 GMT

ఆ ఇల్లు అంటే యజమానికి ఎంతో ఇష్టం. దానిని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ రోడ్డు విస్తరణలో భాగంగా ఆ ఇంటిని సగం కూల్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కూల్చాలంటే మనసురాక దీంతో సగం కూల్చిన బిల్డింగ్‌లో ఉండలేక ఇంటిని వెన్నక్కి జరిపేందుకు డిసైడ్ అయ్యాడు.. ఒక్క ఇటుక కూడా పడగొట్టకుండా ఇంటిని పక్కకు తరలిస్తున్నాడు. ఇంటిని తరలించడమేంటా...అని ఆశ్చర్యపోతున్నారా...? అది ఎలానో మీరే చూడండి.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ఏడీబీ మెయిన్ రోడ్డు ఆనుకుని ఈ భవనం ఉంది దీని యజమాని పోతుల రామ్‌కుమార్. 15ఏళ్ల క్రితం ఆయన ఈ ఇంటిని నిర్మించారు ఆయనకు ఇల్లు అంటే ఎంతో ఇష్టం అలాంటి ఆయనకు కలలో కూడా ఊహించని సమస్య వచ్చి పడింది.

రోడ్డు విస్తరణలో భాగంగా తప్పనిసరిగా ఇల్లు కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అన్ని విధాలా కలిసి వచ్చిన ఆ ఇంటిని కూల్చివేయడం ఇష్టం లేక రామ్ కుమార్ బిల్డింగ్ ను షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు బిల్డింగ్ ఉన్నచోట నుంచి 33 అడుగుల వెన్నక్కి జరిపేందుకు ఏర్పాట్లు మొదలు పెట్టారు దీనిని బీహార్ రాష్ట్రానికి చెందిన కొందరు నిపుణులకు అప్పగించారు. ఇప్పటికే భవనం కింద భాగంలో తవ్వి జాకీలపై నిలిపారు. భవనం తరలింపు ప్రక్రియ దాదాపు 2 నెలల పాటు సాగుతుందని యనిమాని పేర్కొన్నారు. భవనం తరలింపు పనులు సాగుతున్నా రామ్ కుటుంబ సభ్యులు ఎప్పటిలాగానే పై అంతస్తులో ఉంటున్నారు మొత్తానికి జిల్లాలో ఇలా భవనం తరలించడం మొదటిసారి జరుగుతుండటంతో అందరూ దీనిని ఆసక్తిగా చూస్తున్నారు.

Full View  

Tags:    

Similar News