ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్వి ఆరోగ్య పరిస్థితిపై ఆమెకు చికిత్సను అందిస్తున్న డాక్టర్ గౌతమ్ రెడ్డి హెల్త్ బెలిటెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం మనస్వి ఆరోగ్యం నిలకడగా ఉందన్న ఆయన ఆమెకు గొంతు భాగంలో బాగా గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందన్నారు. ఎమర్జెన్సీ సర్జరీ చేస్తామని.. రాత్రి నుంచి వైద్య బృందం చాలా కష్టపడిందని తెలిపారు. చేతి వేళ్ళు అన్నీ కట్ అయ్యాయని... మెడ భాగం కట్ అయినందున ప్లాస్టిక్ సర్జరీ చేశామని చెప్పారు. మనస్వికి 5 ప్యాకెట్ల బ్లడ్ ఎక్కించామని మల్టిపుల్ సర్జరీలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇంకా చికిత్స కొనసాగుతోందన్న ఆయన నిన్నటి కంటే మనస్వి ఆరోగ్యం మెరుగైందన్నారు.