Ram Navami 2026: శ్రీరామ నవమి 2026 ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీరూ ఉన్నారా?
శ్రీరామ నవమి 2026 సందర్భంగా అరుదైన యోగాలు ఏర్పడి కన్య, తుల, మకర, మీన రాశులకు శుభఫలితాలు కలగనున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Ram Navami 2026: శ్రీరామ నవమి 2026 ఈ రాశులకు గోల్డెన్ డేస్.. మీరూ ఉన్నారా?
Ram Navami 2026: హిందూ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటైన శ్రీరామ నవమి ఈ ఏడాది మార్చి 27న జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో శ్రీరామ-సీతల కళ్యాణం నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈసారి శ్రీరామ నవమి శుక్రవారం రావడం ప్రత్యేకతగా భావిస్తున్నారు. అలాగే పారిజాత యోగం, త్రిగ్రహ యోగాలు ఒకేసారి ఏర్పడటంతో ఇది అరుదైన సమయంగా జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ యోగాల ప్రభావం అన్ని రాశులపై ఉండనున్నప్పటికీ, కొన్ని రాశులకు ప్రత్యేకంగా శుభఫలితాలు కలగనున్నాయని చెబుతున్నారు.
కన్య రాశి:
శ్రీరామ నవమి నుంచి చేసే ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కోర్టు వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల రాశి:
శని, రాహు ప్రభావం తగ్గి శుభయోగాలు కలుగుతాయి. గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయం చేస్తారు. ఆస్తి లాభాలు, వాహన యోగం ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
మకర రాశి:
మార్చి 27 నుంచి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. విదేశీ అవకాశాలు కలుగుతాయి. గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు.
మీన రాశి:
ఈ యోగంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధిస్తారు. భూమి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య విశ్వాసాలు, సాధారణ అంచనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. వ్యక్తిగత ఫలితాలు మారవచ్చు. దీనికి మేము బాధ్యత వహించము.