Daily Horoscope: ద్వాదశ ఎఫెక్ట్..ఈరోజు ధనలాభం ఈ రాశులకే..!
Daily Horoscope: మార్చి 18, 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు మీ రాశుల పరిస్థితి ఎలా ఉండబోతుందో పూర్తి వివరంగా తెలుసుకోండి.
Daily Horoscope: ద్వాదశ ఎఫెక్ట్..ఈరోజు ధనలాభం ఈ రాశులకే..!
Daily Horoscope: మార్చి 18, 2026 నాటి ద్వాదశ రాశి ఫలాలు. మేషం నుంచి మీనం వరకు మీ రాశి గతులు, ఉద్యోగం, ఆరోగ్యం , ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో పూర్తి వివరంగా తెలుసుకుందాం.
మేషం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
వృషభం:
పనుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. సహనం అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి.
మిథునం:
నూతన ప్రయత్నాలు ఫలించే సమయం. మిత్రుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. శుభవార్తలు వింటారు.
కర్కాటకం:
ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. బంధువులతో మనస్పర్థలు రాకుండా చూసుకోవాలి.
సింహం:
ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి.
కన్య:
పనుల పట్ల ఏకాగ్రత అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
తుల:
ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాల్లో పెద్దల సలహాలు తీసుకోండి.
వృశ్చికం:
ధైర్యంతో ముందడుగు వేస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు లాభాలు గడించే అవకాశం ఉంది.
ధనుస్సు:
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మకరం:
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత అవసరం.
కుంభం:
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంతాన పరంగా సంతోషకరమైన వార్తలు వింటారు.
మీనం:
చేపట్టిన కార్యాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గృహ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి.
గమనిక: ఇవి సాధారణ రాశి ఫలాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతక చక్రం , గ్రహ గతుల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.