ఫ్లిప్ కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్

Update: 2020-02-15 15:23 GMT

ప్రముఖ ఆన్‌లైన్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి 'మొబైల్స్ బొనాంజా' సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది. ఆపిల్‌, శాంసంగ్‌, వివో, రియల్‌మీ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్‌షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అదనపు బొనాంజాగా ప్రకటించింది.

Tags:    

Similar News