ఈ సారి వరల్డ్ కప్ అభిమానులకు నిరాశనే మిగుల్చుతుంది .. ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు రద్దు అయ్యాయి .. మరెన్ని మ్యాచ్ లు రద్దు అవుతాయో తెలియని పరిస్థితి .. దీనితో అభిమానులు నిరాశకు గురి అవుతున్నారు .. అయితే ఇప్పటి వరకు వర్షం కారణంగా నాలుగు మ్యాచ్ లు రద్దు అయ్యాయి .. మొత్తం ఈ నాలుగు మ్యాచ్ లకు గాను నాలుగు మ్యాచ్‌లకు కలిపి రూ.180 కోట్లు నష్టం వాటిల్లింది .. ఇక రేపు జరగబోయే భారత్ మరియు పాక్ మ్యాచ్ కనుక రద్దు అయితే మరో 137.5 కోట్ల నష్టం జరుగుతుంది .. అయితే ఈ నష్టాలను వరల్డ్‌కప్ ప్రసారాలను సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్ భరించాల్సి వస్తోంది. వర్షాల కారణంగా స్టార్‌స్పోర్ట్స్ రూ. 140 కోట్ల మేర నష్టపోనుంది. ముందు జాగ్రత్త చర్యగా ఛానల్ నిర్వాహకులు బీమా తీసుకోవడంతో ఆ నష్టాలను బీమా కంపెనీలే భరించాల్సి ఉంటుంది. అంతే కాకుండా స్టార్‌స్పోర్ట్స్‌తో అడ్వర్టైజింగ్ ఒప్పందాలు కుదుర్చుకున్న కోకాకోలా, ఉబర్, వన్‌ప్లస్, ఎమ్మారెఫ్ టైర్స్ వంటి కంపెనీలు సైతం కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంది ..