ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-20 01:13 GMT
Live Updates - Page 2
2020-05-20 08:03 GMT

తూ.గో తొండంగి మండలం బెండపూడి గ్రామంలో అన్నపూర్ణ అనే 45 మహిళ నేల బావిలో పడి అనుమానాస్పద మృతి , కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

2020-05-20 08:02 GMT

తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో ఎన్టీఆర్ నగర్ లో బ్లాక్ నెంబర్ 33 లో వడ్లపాటి నాగేశ్వరరావు (30) అనుమాస్పద మృతి

2020-05-20 08:01 GMT

మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నాగారం గ్రామంలో తండ్రి సెల్ ఫోన్ కొనిఇవ్వలేదంటూ అనిల్ (19)అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య.

2020-05-20 08:01 GMT

రేపటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించనున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు. విశాఖ నగరాల్లో సిటీ సర్వీసులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు రేపు ఉదయం నుంచి పునరుద్ధరించనున్నట్టు మాదిరెడ్డి ప్రతాప్‌ తెలిపారు.

-మరిన్ని వివరాలు 

2020-05-20 06:32 GMT

రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద రౌడీ షీటర్ హత్య. హత్యకు గురైన వ్యక్తి సారంగధర మెట్ట తుమ్మలావ కు చెందిన అద్దేపల్లి సతీష్ గా గుర్తింపు.... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు.

2020-05-20 06:30 GMT

ఒకటి నుంచి నిట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు

ఏపీ నిట్‌లో బీటెక్‌ చివరి సంవత్సర విద్యార్థులకు జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు నిట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సూర్యప్రకాశరావు మంగళవారం తెలిపారు. పరీక్షలు ఐదు రోజులు పాటు కొనసాగుతాయని, గేట్‌ మోడల్‌లో నిర్వహిస్తామని చెప్పారు.

చివరి సంవత్సర విద్యార్థుల్లో కొందరు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపికవడంతో తుది ఫలితాలు వెలువడిన తర్వాత కంపెనీలు ఉద్యోగాల్లో చేర్చుకోనున్నాయి. దాంతో ముందుగానే చివరి సంవత్సరం విద్యార్థులకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు

2020-05-20 06:29 GMT

ఏపీలో మరో 68 కరోనా పాజిటివ్ కేసులు

♦ 9159 సాంపిల్స్ ని పరీక్షించగా 68మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు

♦ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,407 కి చేరాయి.

♦ గడిచిన 24గంటల్లో ఒకరు మృతి చెందినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు.

♦ 43 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు.

♦ ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 715 మంది చికిత్స పొందుతున్నారు.

♦ లోని నమోదైన మొత్తం 2407 పాజిటివ్ కేసు లకు గాను 1639 మంది డిశ్చార్జ్ కాగా, 53 మంది మరణించారు.

2020-05-20 06:26 GMT

వన్దేభారత్ మిషన్లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్ కు తరలించే భాగంలో లండన్ నుండి సుమారు 140 మంది ప్రయాణికులతో కొద్ది సేపటి క్రితం ఎయిర్ ఇండియా విమానం చేరుకుంది. వారందరికీ ఎయిర్ పోర్ట్ వద్ద స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం వారందరిని క్వారంటైన్ కు తరలించేందుకు సుమారు 10 ఆర్టీసి బస్సులు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి

2020-05-20 05:29 GMT

చిత్రపరిశ్రమకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

కరోనా దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. షూటింగులు లేక సినీ కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో సినిమా, టీవీ రంగాల షూటింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయించింది.

-మరిన్ని వివరాలు 

2020-05-20 04:21 GMT

ఏపీలో రేపటి నుంచే ఆర్టీసీ సర్వీసులు

ఏపీలో ఆర్టీసీ బస్‌ సర్వీసులు పునరుద్ధరించేందుకు రంగం సిద్ధమైంది. సీఎం ఆదేశించడంతో గురువారం నుంచి అధికారులు ప్రణాళిక బస్సులు నడిపేందుకు సిద్ధమయ్యారు.

-మరిన్ని వివరాలు 

Tags:    

Similar News