ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!
x
Highlights

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా...

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 20మే 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

తాజా వార్తల్ని తెలుసుకునే ముందు ..ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం కాస్త మేఘావృతమై ఉండి కనిష్టంగా 26 డిగ్రీలు , గరిష్టంగా 36 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ 37 శాతం ఉంటుంది. ఇక విజయవాడలో కనిష్టంగా 28 డిగ్రీలు, గరిష్టంగా 44 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ గాలిలో తేమ 46 శాతం ఉంటుంది.

తాజా వార్తలు



Show Full Article

Live Updates

  • 20 May 2020 2:57 PM GMT

    రంగారెడ్డి జిల్లా షాదనగర్ బై పాస్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం..

    డీసీయం వాహనం ఢీకొని తండ్రి కొడుకులు మృతి....

    పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 

  • 20 May 2020 2:56 PM GMT

    - విశాఖ జిల్లా, జీ. మాడుగుల మండలం గెమ్మెలి పీహెచ్సీని తనిఖీ చేసిన పాడేరు ఐటిడిఎ ఇన్ ఛార్జ్ పీవో వెంకటేశ్వర్లు.

    - విధులకు డుమ్మా కొట్టిన డాక్టర్ ఐశ్వర్య.

    - షోకాజ్ నోటీసులు జారీ చేసిన పీఓ.

  • 20 May 2020 2:55 PM GMT

    జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చంద్రు తండా గ్రామ శివారులోని వ్యవసాయ బావుల వద్ద భారీ అగ్ని ప్రమాదం

    - 8 గడ్డివాములు దగ్ధం

    - పశువులు మృతి.

    - అందుబాటులో లేని అగ్నిమాపక వాహనం.

    - పూర్తిగా దగ్ధమైన గడ్డివాములు, వ్యవసాయ పనిముట్లు.

  • 20 May 2020 2:54 PM GMT

    మంచిర్యాల జిల్లా..వేమనపల్లి మండలం నాగారం గ్రామంలో తండ్రి సెల్ ఫోన్ కొనిఇవ్వలేదంటూ

    అనిల్ (19)అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య.

  • 20 May 2020 11:42 AM GMT

    22 న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు

    కరీంనగర్ టౌన్: పట్టణ కేంద్రంలో ఈరోజు బద్దం ఎల్లారెడ్డి భవన్ లో అన్ని కార్మిక సంఘాల సమావేశం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... 22 న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు పిలుపు ఇచ్చాయి. ఈ పిలుపు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పని చేసే చోట్ల నిరసన కార్యక్రమాలు కార్మికులు చేయాలని కోరారు. కరోనా సాకు చూపి కార్మిక చట్టాలను రద్దు చేయాలని, పని గంటల విధానం పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మద్య ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గోవా, రాజస్తాన్, ఒరిస్సా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 8 నుండి 12 గంటలు కావాలని,3 సంవత్సరాల పాటు ఎలాంటి కార్మిక చట్టాలను వర్తించవని నిర్ణయం తీసుకున్నారు.

    ఇది కార్మిక వ్యతిరేక చర్యలు. తెలంగాణ రాష్ట్రoలో కూడా అలాంటి అవకాశం కోసం కార్మిక హక్కుల కోసం పోరాటం చేస్తున్న నాయకులను, కార్మికుల పైన జీవో.64 తీసుకొచ్చి అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా సమయం లో వేతనాలు ఇవ్వాలని జీవో లు ఇచ్చిన అమలు చెయ్యలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాస్, కార్యదర్శి ఎడ్ల రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న యాదవ్, టేకుమ్మల్ల సమ్మయ్య, ఐఎఫ్టీయూ నాయకులు జిందం ప్రసాద్, టీఎన్టీయూసీ నాయకులు కల్యడపు ఆగయ్యలు పాల్గొన్నారు.



     


  • 20 May 2020 11:24 AM GMT

    లాక్ డౌన్ , కోవిడ్ -19 పేరుతో విద్యా రంగాన్ని కార్పోరేట్ శక్తులకు అందించవద్దు

    కరీంనగర్ టౌన్: అన్ని రకాల యూనివర్శీటీలకు ఒకే రకమైన అకడమిక్ క్యాలెండర్ ఉండాలిపెండింగ్ ఫెలోషిప్స్ విడుదల చేయాలని, కరోనా పరిస్థితులలో ప్రభుత్వమే విద్యార్థుల ఫీజులు చెల్లించాలని, ఆన్లైన్ భోధన ముఖాముఖి క్లాస్ రూమ్ బోధనకు ప్రత్యామ్నాయం కాదని ఎస్.ఎఫ్.ఐ అల్ ఇండియా పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో, మంకమ్మతోటలోని (ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కార్యాలయంలో ప్లేయకర్డ్స్ తో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి శనిగారపు రజినీకాంత్ మాట్లాడుతూ... దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం విద్యా రంగాన్ని బలోపేతం చేసేలా, రక్షించేలా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పైగా ఆన్ లైన్ క్లాసులు, ఆన్ లైన్ పరీక్షలు పేరుతో తరగతులు నిర్వహిస్తున్నారని, ఆన్ లైన్ క్లాసుల పేర ప్రభుత్వ రంగ విద్యరంగానికి త్రీవమైన అన్యాయం బీజేపీ ప్రభుత్వం చేసిందని నిరసిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా త్రీవ నిరసనలు, ఆందోళనలు నిర్వహించటం జరిగింది. దేశంలో ఆన్ లైన్ లోనే చదువులు, పరీక్షలు నిర్వహించి చదువు పట్ల తన భాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవాలనే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గజ్జెల శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎం.భరత్, హేమంత్, చరణ్, సంజయ్, పవన్ లు పాల్గొన్నారు.



     




  • 20 May 2020 11:21 AM GMT

    నకిలీ సోషల్ మీడియా అకౌంట్ ను సృష్టించిన యువతిపై కేసు నమోదు

    కరీంనగర్ టౌన్: తన ప్రియుడు మరో మహిళతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేక మరో మహిళతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని గుర్తించి ప్రియుడి ద్వారా సదరు మహిళకు సంబంధించిన ఫోన్ నెంబర్ ను తీసుకుని ఆమె ఫోటో తో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ ను సృష్టించి వివిధ ప్రాంతాలకు చెందిన వారిని అసభ్యకరమైన, భయాందోళనలు, బెదిరింపులకు గురి చేసే విధంగా పోస్టులు పెట్టడంతోపాటు పలువురికి పదే పదే ఫోన్లు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న, మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి పై రామడుగు పోలీసులు బుధవారం నాడు కేసు నమోదు చేశారు వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఒక మహిళ ఒక దుకాణంలో పనిచేస్తున్నది. తన ప్రియుడు ఈ మధ్య ఆమెతో సన్నిహితంగా మెదులుతున్నాడనే విషయాన్ని జీర్ణించుకోలేక, సదరు మహిళ ఫోన్ నెంబర్ ను ప్రియుడి ద్వారా సేకరించడంతో పాటు ఇతరుల సహకారం తో సోషల్ మీడియా అకౌంట్ ను ఏర్పాటు చేసింది. అనుమతి లేకుండా తన ఫోటో ను డౌన్లోడ్ చేసి ఈ నూతనంగా సృష్టించిన సోషల్ మీడియా అకౌంట్ కు బాధిత మహిళ ఫోటో పెట్టింది. ఉద్దేశపూర్వకంగా సృష్టించబడిన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అసభ్యకరమైన, భయాందోళనలు, బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉండే పోస్టులను పెట్టడంతోపాటు పలువురికి ఫోన్లు చేస్తున్నది. పదే పదే ఆ నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్న విషయాన్ని బాధితురాలు రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష దృష్టికి తీసుకువచ్చారు.సత్వరం స్పందించి,టెక్నాలజీ వినియోగంతో సోషల్ మీడియా అకౌంట్ కొనసాగిస్తున్న యువతిని గుర్తించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు బుధవారం నాడు నకిలీ సోషల్ మీడియా అకౌంట్ ను సృష్టించిన సదరు యువతి పై కేసు నమోదు చేశారు.


     

  • 20 May 2020 11:19 AM GMT

    వలస కార్మికులకు భోజనం పొట్లాలు పంపిణీ చేసిన రామునాయుడు

    పెందుర్తి: లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు 96వ వార్డు బీజేపీ- జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి గొర్లి రామునాయుడు ఆర్థిక సహాయంతో భోజనం పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామునాయుడు మాట్లాడుతూ... వలస కార్మికులు ఒకపక్క పని లేకుండా, మరోపక్క సొంత ఊర్ల కి వెళ్ళకుండా ఇబ్బందులు పడటంతో వారికి తాను ఆహారం అందజేసి పలు సౌకర్యాలు చేసినట్లు తెలిపారు. వీరు సొంత గ్రామాలకు వెళ్లడానికి తాను సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


     

  • 20 May 2020 9:24 AM GMT

    ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    ఢిల్లీ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

    - 50శాతం రిజర్వేషన్లు మించొద్దన్న హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

    - 48.13శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

    - పిటిషన్‍పై జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ విచారణ

    - 1992లో ఇంద్రసహాని కేసులో ప్రత్యేక పరిస్థితుల్లో 50 శాతం మించవచ్చన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరిన పిటిషనర్ రామ్మోహన్‍నాయుడు

    - 2010లో రిజర్వేషన్లపై రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకే కట్టుబడి ఉండాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.



     


  • 20 May 2020 8:19 AM GMT

    అతి తీవ్ర తుఫాన్‌గా ఉంఫాన్..

    -మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు

    -ఉంఫాన్ తీవ్రతకు తీరం అల్లకల్లోలంగా తయారైంది.

    -పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది.

    -ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.

    -దక్షిణకోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

    -మరిన్ని వివరాలు 

Print Article
More On
Next Story
More Stories